Flight Accident | కెనడా దేశంలో దారుణం చోటు చేసుకుంది. ఓ విమానం కుప్పకూలింది. కెనడా దేశంలోని టొరంటో పియర్ సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారు జామున కెనడాలోని మిన్నె పొలిస్ నుంచి డెల్టా ఎయిర్ లైన్స్ కు చెందని విమానం ఈ ఎయిర్ పోర్టుకు వచ్చింది. ల్యాండ్ అయిన తర్వాత అదుపు తప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 18 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు చెప్పారు. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తం అయి సహాయక సేవలు అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.