Vivian Jenna Wilson: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ప్రపంచ కుభేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) మధ్య తలెత్తిన విభేదాలు.. ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్’ (Big and Beautiful Bill) విషయంలో తలెత్తిన వివాదం.. ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య దూరాన్ని అమాంతం పెంచింది. దీంతో ఇద్దరూ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ఈ వివాదంపై ఎలాన్ మస్క్ కూతురు వివియన్ జెన్నా విల్సన్ సెటైరికల్ గా స్పందించారు.
వివియన్ ఏమన్నారంటే?
21 ఏళ్ల వివియన్ జెన్నా విల్సన్.. తన తండ్రి ఎలాన్ మస్క్ తో తెగదెంపులు చేసుకొని జీవిస్తోంది. పుట్టుకతో వివియన్ అబ్బాయి కాగా.. 2022లో చట్టబద్దంగా తన జెండర్ ను మార్చుకొని ప్రస్తుతం స్వతంత్రంగా జీవిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో తన తండ్రికి విభేదాలు తలెత్తిన నేపథ్యంలో.. వివియన్ తన ఇన్ స్టాగ్రామ్ లో షార్ట్ వీడియో క్లిప్ ను పెట్టింది. ‘నేను కరెక్ట్ అని నిరూపించబడటం చాలా ఇష్టం’ అని ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. అయితే ఈ పోస్ట్ లో ఎక్కడా ట్రంప్, మస్క్ పేర్లను ఆమె ప్రస్తావించలేదు.
‘వాతావరణం ప్రశాంతంగా ఉంది’
అలాగే మెటా థ్రెడ్స్ ఫ్లాట్ ఫామ్ లోనూ వివియన్ ఆసక్తికర పోస్టులు పెట్టింది. ప్రముఖ సింగర్ చేజ్ ఐకాన్ (Chase Icon) పాడిన జాబ్ అప్లికేషన్ పాటతో పాటు ‘జీవితంలో ఎంత అందం’ అని పోస్ట్ పెట్టింది. మరొక పోస్టులో ‘ఈ రోజు వాతావరణం చాలా అందంగా ఉంది’ అంటూ కామెంట్ పెట్టింది. ఇదిలా ఉంటే వివియన్ తన తండ్రితో పూర్తిగా సంబంధాలను తెగతెంచుకుంది. తన తండ్రితో ఏ విధమైన రిలేషన్ ను తాను కోరుకోవడం లేదని గతంలో కోర్టుకు సైతం ఆమె తేల్చి చెప్పింది. 2022లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో వివియన్ గురించి ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కొడుకును కోల్పోయానని స్పష్టం చేశారు.
Also Read: Cm Chandrababu: టీడీపీ ఎమ్మెల్యేలకు షాక్.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!
ట్రంప్‌పై మస్క్ బాంబ్
మరోవైపు ట్రంప్ – మస్క్ వివాదం రోజు రోజుకు మరింత ముదురుతోంది. ఒకరిపై ఒకరి మాటల దాడి తీవ్రత అమాంతం పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే అమెరికాలో సంచలనం సృష్టించిన లైంగిక కుంభకోణం నిందితుడు జెఫ్రీ ఎప్ స్టైన్ ట్రంప్ కు సంబంధాలు ఉన్నాయని మస్క్ ఆరోపించారు. అతిపెద్ద బాంబు పేల్చాల్సిన సమయం ఆసన్నమైందంటూ ఎక్స్ లో రాసుకొచ్చారు. ఎప్ స్టైన్ తో ఉన్న రిలేషన్స్ వల్లే దర్యాప్తులో వెల్లడైన విషయాలను ట్రంప్ ఇప్పటివరకూ బహిరంగ పరచలేదని మస్క్ పేర్కొన్నారు. భవిష్యత్తులో నిజా నిజాలు బయటపడతాయని మస్క్ అభిప్రాయపడ్డారు.