Carona Virus
అంతర్జాతీయం

Carona Virus : చైనాలో మరో కొత్త వైరస్.. ఇది మరింత డేంజర్..!

Carona Virus : కొవిడ్ కు పుట్టినల్లు అయిన చైనాలో (china) నిత్యం ఏదో ఒక కొత్త వైరస్ పుట్టుకొస్తూనే ఉంది. ఇప్పటికే చాలా రకాల వైరస్ లకు చైనా కేరాఫ్ అడ్రస్ అయిపోయింది. రీసెంట్ గానే ఓ వైరస్ వెలుగు చూసింది. అది మరువక ముందే.. ఇప్పుడు మరో కొత్త వైరస్ వెలుగుచూసింది. చైనాలో కొవిడ్‌ ను (covid-19) పోలిన కొత్త వైరస్ ను గుర్తించారు. ఇది జంతువుల నుంచి మానవులకు వచ్చినట్టు చెబుతున్నారు. గబ్బిలాల్లో గుర్తించిన ఈ కొత్త వైరస్‌ను హెచ్‌కెయూ5- కోవ్‌-2 గా చెబుతున్నారు.

కొవిడ్‌ 19కి కారణమైన SARS-CoV-2ను పోలి ఉన్నట్లు పరిశోధనల్లో గుర్తించారు. ఈ వైరస్‌ మెర్బెకోవైరస్‌తోపాటు ప్రాణాంతక మెర్స్‌-కోవ్‌ ఉప రకానికి చెందినదిగా అంతర్జాతీయ మీడియా పేర్కొంది. దీన్ని మొదట హాంకాంగ్‌లోని జపనీస్‌ పిపిస్ట్రెల్‌ రకం గబ్బిలాల్లో గుర్తించారు. కాకపోతే దీని ప్రభావం గతంలో వచ్చిన కొవిడ్-19 కంటే తక్కువగానే ఉందని చెబుతున్నారు. ఇది మొదటగా పేగు కణాలకు లేదంటే శ్వాసకోస అవయవాలకు అంటుకునే ప్రమాదం ఉన్నట్టు సైంటిస్టులు చెబుతున్నారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!