Austrian Woman: ఆస్ట్రియా దేశంలో దారుణం చోటుచేసుకుంది. గ్రాస్‌గ్లాక్‌నర్ మంచు పర్వతం (Grossglockner Mountain)పై 33 ఏళ్ల మహిళ కేర్స్‌టిన్ (Kerstin Gurtner) గడ్డ కట్టుకుపోయి మరణించింది. ఆస్ట్రియాలోని సాల్జ్ బర్గ్ (Salzburg) ప్రాంతానికి చెందిన కేర్స్‌టిన్ తనను తాను వింటర్ చైల్డ్ (శీతాకాలపు పిల్ల)గా సోషల్ మీడియాలో అభివర్ణించుకుంది. అయితే ప్రియుడు థామస్ ప్లాంబర్గర్ (Thomas Plamberger)తో కలిసి పర్వతారోహణకు వెళ్లి అతడి నిర్లక్ష్యంగా కారణంగా కేర్స్‌టిన్ ప్రాణాలు విడిచింది.
అసలేం జరిగిందంటే?
థామస్, కేర్స్‌టిన్ జంట తాము నిర్ణయించుకున్న సమయానికి 2 గంటలు ఆలస్యంగా పర్వతారోహణ ప్రారంభించినట్లు ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ న్యూయర్క్ పోస్ట్ ఓ కథనంలో పేర్కొంది. దాని ప్రకారం.. గ్రాస్‌గ్లాక్‌నర్ పర్వతంపై -20°C ఉష్ణోగ్రతలు ఉండటం, వేగంగా తుపాను గాలులు వీయడంతో శిఖరానికి 150 అడుగుల దూరంలో ఉండగా కేర్స్ టిన్ హైపోతర్మియా బారిన పడి తీవ్ర గందరగోళానికి గురైంది. అయితే ఆమె బాయ్ ఫ్రెండ్ థామస్ ఆమె కోసం ఎలాంటి రక్షణ ఏర్పాట్లు చేయకుండా అక్కడే నిర్లక్ష్యంగా వదిలేసి అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో సహాయం కోసం బయలుదేరాడు. అత్యవసర దుప్పట్లు లేదా బివాక్ బ్యాగ్ వాడి ఆమెను చలి నుంచి రక్షించే ప్రయత్నం కూడా థామస్ చేయలేదని ఆరోపణలు ఉన్నాయి.
ప్రియుడి ఘోర నిర్లక్ష్యం
అంతేకాదు రెస్క్యూ టీమ్ ను సంప్రదించిన తర్వాత థామస్ తన సెల్ ఫోన్ ను సైలెంట్ లో పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో కేర్స్ టిన్ జాడను రెస్క్యూ టీమ్ గుర్తించేందుకు మరింత ఆలస్యమైంది. బలమైన గాలుల కారణంగా రక్షణ బృందాలు ఉదయం వరకూ కేర్స్ టిన్ ను చేరుకోలేకపోయాయి. ఉదయం ఘటనాస్థలికి చేరుకునే సరికి కేర్స్ టిన్ మంచులో గడ్డకట్టుకుపోయి చనిపోయిన స్థితిలో కనిపించింది. థామస్ ఘోర నిర్లక్ష్యం కారణంగానే కేర్స్ టిన్ మృతి చెందినట్లు రెస్క్యూ టీమ్ ఆరోపించింది. అంతేకాదు స్థానిక పోలీసులు.. థామస్ పై హత్యారోపణలు కింద కేసు కూడా నమోదు చేశారు.
Also Read: Bigg Boss 9 Telugu: ప్రోమో అదిరింది.. పోగొడుతూనే హౌస్ మేట్స్ మధ్య చిచ్చు పెట్టిన బిగ్ బాస్
దోషిగా తేలితే.. జైలు శిక్ష
గతంలో అనేకసార్లు పర్వాతరోహణ చేసినందున.. ఈ ట్రెక్కింగ్ కు థామస్ మార్గదర్శిగా ఉన్నట్లు తెలుస్తోంది. హైపోథెర్మియా బారిన పడితే ఎలా బయటపడాలన్న బాధ్యత అతడిపై ఉందని దర్యాప్తు వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇందులో దోషిగా తేలితే థామస్ కు 3 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశముందని దర్యాప్తు వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా ఈ కేసు సంబంధించి విచారణ 2026 ఫిబ్రవరి 19న కోర్టు ముందు విచారణకు రానుంది. మరోవైపు కేర్స్ టిన్ కుటుంబ సభ్యులు.. ఆమె మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కేర్స్ టిన్ చాలా మంచి వ్యక్తి అని, ఎంతో చురుగ్గా ఉండేదని ఆమె స్నేహితులు పేర్కొన్నారు.

