India China border issue news
అంతర్జాతీయం

Amruthsar : చైనా డ్రోన్ల కూల్చివేత

చైనా డ్రోన్ల కూల్చివేత

India China border issue news(Telugu breaking news) : ప్రపంచ దేశాల్లో ఎంతగా చులకన అవుతున్నా.. చైనా తన తీరు మార్చుకోవడంలేదు. భారత్ తో కయ్యం పెట్టుకునే దిశగానే ఆ దేశం చర్యలు ఉంటున్నాయి. నోటితో ఒకటి చెబుతూ.. నొసటితో మరొకటి చేస్తోంది. దేశ సరిహద్దులో ఛైనా మళ్లీ తోక జాడిస్తోంది. మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. భారత సరిహద్దుల్లో డ్రోన్లు ఎగురవేసింది. వెంటనే అప్రమత్తమైన భారత భద్రతా దళాలు పంజాబ్ పోలీసులతో కలిసి అమఈత్సర్ బోర్డర్లోని వేర్వేరు ప్రదేశాలలో రెండు డ్రోన్లను స్వాధీనం చేసుకున్నారు.

అమృత్‌సర్ జిల్లా సరిహద్దు ప్రాంతంలోని రెండు వేర్వేరు ప్రదేశాలలో డ్రోన్‌లు తిరుగుతున్నట్లు బీఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్‌కి సమాచారం అందింది. పంజాబ్ పోలీసులతో బీఎస్ఎఫ్ దళాలు అనుమానిత ప్రాంతాలలో సర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో రెండు డ్రోన్లు స్వాధీనం చేసుకున్నారు.. చైనా తయారు చేసిన డీజేఐ మావిక్ 3 క్లాసిక్‌ డ్రోన్లుగా గుర్తించారు. రెండూ కూడా లభ్యం అయ్యాయి. డ్రోన్‌ని ఆపరేట్ చేస్తున్న వ్యక్తులు వాటిని తిరిగి రప్పించుకోవడానికి ప్రయత్నించినా వారి ప్రయత్నాలు విఫలం చేశారు.. అంతకుముందు ఏప్రిల్ 20 న ఫిరోజ్‌పూర్ సరిహద్దు ప్రాంతంలో మూడు హెరాయిన్ ప్యాకెట్లను కలిగి ఉన్న డ్రోన్‌ను బీఎస్ఎఫ్ స్వాధీనం చేసుకుంది. డ్రోన్‌ ఎగురుతున్నట్లు ఇంటెలిజెన్స్ విభాగానికి సమాచారం అందింది. స్పందించిన బీఎస్ఎఫ్ బలగాలు అనుమానిత ప్రాంతంలో విస్తృతంగా సోదాలు నిర్వహించాయి. ఈ సోదాల్లో 2.710 కిలోల బరువున్న 3 హెరాయిన్ ప్యాకెట్లతో పాటు ఒక డ్రోన్‌ని విజయవంతంగా స్వాధీనం చేసుకున్నారు. నీలిరంగు బ్యాగ్‌లో హెరాయిన్ ఉందని అధికారులు తెలిపారు. ఇలా సరిహద్దులో పాకిస్థాన్, చైనా నుంచి నిత్యం కవ్వింపులు ఎదురవుతుండంతో సరిహద్దు భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?