- నాలుగేళ్లకొకసారి జరిగే అమెరికా ఎన్నికలు
- నిర్ణయాత్మక శక్తిగా ఎదిగిన భారత ఓటర్లు
- జో బిడెన్-ట్రంప్ మధ్య హోరాహోరీ పోటీ
- ఇద్దరిలో ఎవరు గెలవాలన్నా భారత ఓటర్లే ప్రధానం
- గ్రీన్ కార్డు కలిగిన భారతీయులు 65,960
- పెండింగ్ లో ఉన్న 2,90,000 మంది భారతీయులు
- పెరుగుతున్న అమెరికాకు వెళుతున్న భారతీయులు
- యుఎస్ కీలక పదవుల్లోనూ భారత సంతతిదే హవా
Indian voters desiding factor in America Presidental Elections:
ప్రపంచమంతా ఎదురుచూసే అగ్రరాజ్యం అమెరికా ఎన్నికలు ప్రతి నాలుగేళ్లకొకసారి జరుగుతాయి. ఈ సంవత్సరం నవంబర్ లో జరగనున్న ఎన్నికలలో ప్రస్తుత అధ్యక్షుడు జో బిడెన్, మాజీ అధ్యక్షుడు ట్రంప్ ముఖాముఖీ తలపడనున్నారు. అయితే ఇటీవల అక్కడ ఇద్దరిలో ఎవరు గెలుస్తారని ఒపీనియన్ పోల్ నిర్వహించింది. అందులో డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి జో బిడెన్ కన్నా 6 శాతం ఆధిక్యంలో ఉన్నారని వెల్లడించింది. అయితే అమెరికాలో ఎప్పటికప్పుడు సమీకరణాలు మారిపోతుంటాయి. తీరా ఎన్నికల సమయం దగ్గరపడ్డప్పుడు జనం ఒపీనియన్ వేరేలా ఉంటుంది. అయితీ ఇవన్నీ పక్కన పెడితే అమెరికా ఎన్నికలలో భారత పౌరుల భాగస్వామ్యం ఎంత అని ప్రశ్నించుకుంటే చాలా ఆసక్తికరమైన అంశాలు బహిర్గతమయ్యాయి. అమెరికా అధ్యక్షుడిని నిర్ణయించేది భారతీయ ఓటర్లే అంటే ఆశ్చర్యం కలగక మానదు.
పెరుగుతున్న భారతీయుల సంఖ్య
అమెరికాలో నివసిస్తున్న భారతీయుల్లో 65,960 మందికి అగ్రరాజ్య పౌరసత్వం అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. అనేకమంది భారతీయులు అక్కడ ఎప్పటి నుంచో నివసిస్తున్నా అందరికీ అక్కడ అమెరికా పౌరసత్వం లేదు. మనదేశంలో పుట్టి అక్కడ జీవిస్తున్నవారిలో దాదాపు 42 శాతం మందికి అక్కడి పౌరసత్వం పొందే అర్హత లేదని సీ ఆర్ ఎస్ నివేదిక తెలుపుతోంది.2023 నాటికి గ్రీన్ కార్డ్ లేదా లీగల్ పర్మినెంట్ రెసిడెన్సీ వున్న 2,90,000 మంది భారతీయులకు సహజ విధానంలో పౌరసత్వం పొందే అవకాశం వుందని చెబుతున్నారు. అమెరికాలో నివసిస్తున్న విదేశీయులు ఆ దేశ జనాభాలో 14శాతం. గతంతో పోల్చుకుంటే అమెరికాలో నివసించే భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగింది.సాఫ్ట్ వేర్ రంగం పెరుగుతున్న కొద్దీ మనవాళ్ళ సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. విద్యార్థులు కూడా పెరుగుతున్నారు. తెలుగువారు కూడా బాగా పెరుగుతున్నారు.1.35 శాతంతో దాదాపు 50లక్షల మందికి పైగా మనవారు అగ్రరాజ్యంలో నివసిస్తున్నారు.
ట్రంప్ – బైడెన్ మధ్య హోరాహోరీ
నవంబర్ లో జరగబోయే ఎన్నికల్లో ట్రంప్ – బైడెన్ మధ్య హోరాహోరీ పోరు వుంది. ట్రంప్ అధికారంలోకి వస్తే భారత్ కు, అక్కడ నివసించే భారతీయులకు ఎక్కువ మేలు జరుగుతుందని ఒక వర్గం అంటోంది. మనది ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్. మనతో అగ్రరాజ్యానికి చాలా అవసరం వుంది. గతంతో పోల్చుకుంటే మన అవసరం ఆ దేశానికి పెరుగుతోంది. అమెరికా – భారత్ మధ్య వాణిజ్య, వ్యాపారాలు పెరుగుతున్నాయి. ఇంకా పెరగాల్సి వుంది. పెట్టుబడులు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, అక్కడ నివసించే మన వారికి పన్నుల రాయతీలోనూ, వ్యాపార ప్రోత్సాహకాలలోనూ, పౌరసత్వ కల్పనలోనూ, రాజకీయ భాగస్వామ్యంలోనూ ఇంకా సహకారం ఎంతో పెరగాల్సి వుంది. ఇమిగ్రేషన్, వీసాల అనుమతులు, ఉద్యోగాల కల్పనలో అగ్రరాజ్యం ఇంకా ఉదారంగా వ్యవహరించాలి.
ప్రస్తుతం,అమెరికాలో కీలక భూమిక పోషిస్తున్న భారతీయులు భవిష్యత్తులో మరింత కీలకమైన వ్యక్తులుగా, వ్యవస్థలుగా మారతారని నిస్సందేహంగా చెప్పవచ్చు. అగ్రరాజ్యంలో భారతీయుల అధికారిక అమెరికా పౌరుల సంఖ్య భవిష్యత్తులో గణనీయంగా పెరుగుతుందని అంచనా .ఇప్పటికే పౌరసత్వం వున్న కొందరికి సంపూర్ణమైన స్వేచ్ఛ లేదు.దానికి కూడా పరిష్కారం లభించాలి. ఉభయ పౌరసత్వం ( అమెరికా – భారత్ ) పట్ల కూడా అడుగులు పడవచ్చు.