AI vs Human Brain: లండన్‌లో జరిగిన FT Future of AI Summit 2025లో ప్రపంచంలోని ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులు ఒకే వేదికపై సమావేశమయ్యారు. ఆ సమ్మిట్‌లో “ఏఐ (Artificial Intelligence) ఎప్పుడు మనిషి మేధస్సు స్థాయికి చేరుకుంటుంది?” అనే ప్రశ్నపై తీవ్రంగా చర్చలు జరిగాయి.
20 ఏళ్లలో చేరతామని గోడ్‌ఫాదర్ హింటన్ అంచనా
ఏఐ ప్రపంచానికి “గాడ్‌ఫాదర్ ఆఫ్ ఏఐ”గా పేరుగాంచిన జెఫ్రీ హింటన్ మాట్లాడుతూ .. “దీన్ని ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI)గా చెప్పుకుంటే, మనం ఇంకా 20 ఏళ్లలో చేరుకుంటాం” అని ఆయన తెలిపారు. ఆయనతో పాటు NVIDIA సీఈఓ జెన్సన్ హువాంగ్, AI పరిశోధకుడు యోషువా బెంజియో, స్టాన్‌ఫోర్డ్ ప్రొఫెసర్ ఫెయ్-ఫెయ్ లీ, మెటా చీఫ్ సైంటిస్ట్ యాన్ లెకూన్, మరియు NVIDIA చీఫ్ సైంటిస్ట్ బిల్ డ్యాలీ కూడా పాల్గొన్నారు.
ఏఐ భవిష్యత్తుపై అందరి అభిప్రాయాలు ఒకట్టేనా?
ప్రపంచంలోని ఈ ఆరుగురు ఏఐ మహానుభావులు.. వీరందరూ ఆధునిక ఏఐ రూపకర్తలు, ఇంకా ఈ ఏడాది క్వీన్ ఎలిజబెత్ ఇంజినీరింగ్ పురస్కారం విజేతలు కూడా. కానీ, ఆసక్తికర విషయం ఏమిటంటే, వీరంతా ఏఐ భవిష్యత్తుపై ఒకే అభిప్రాయానికి రాలేదు. కొందరు “మనం ఇప్పటికే ఆ స్థాయికి చేరుకున్నాం” అంటుంటే, మరికొందరు “ఈ ప్రశ్నే తప్పు” అని కొందరు వాదిస్తున్నారు.
“ మిషన్ మేధస్సు.. మనిషి మేధస్సు ఒక్కటి కాదు” – ఫెయ్ ఫెయ్ లీ కామెంట్స్
ఆధునిక డీప్ లెర్నింగ్ విప్లవానికి ఎవరు బాట వేశారో, ఆమె అభిప్రాయం మాత్రం వేరుగా ఉంది. “మిషన్ మేధస్సు తో మనిషి మేధస్సు పోలిస్తే ఇవి రెండు వేర్వేరు ప్రపంచాలు. కొన్ని విషయాల్లో యంత్రాలు మనుషులను మించిపోతాయి, కానీ మరికొన్ని విషయాల్లో ఎప్పటికీ మనుషుల్లా ఉండవు” అని ఆమె చెప్పింది.
ఉదాహరణకు “మనలో ఎంతమంది 22,000 వస్తువులను ఒకే చూపులో గుర్తించగలము? లేక 100 భాషలను అనువదించగలము?” అని ఆమె ప్రశ్నించారు. అయితే, “ఈ రోజు ఉన్న శక్తివంతమైన AI మోడల్స్ కూడా ‘స్పేషియల్ ఇంటెలిజెన్స్’ లో విఫలమవుతున్నాయి” అని ఆమె మరో కీలక అంశం ప్రస్తావించారు. ఆమె మాటల్లో “ మనిషి మేధస్సు భాషను మించిపోయి ఉంది. అది చూడడం, ఆలోచించడం, ప్రతిస్పందించడం, కొత్త ప్రపంచాలను సృష్టించడం వంటి విస్తృతమైన సామర్థ్యాల సమాహారం” అని ఆమె చెప్పుకొచ్చింది.
