India Russia Trade: రష్యాలో భారత ఎగుమతులకు భారీ అవకాశం
India Russia Trade ( Image Source: Twitter
అంతర్జాతీయం

India Russia Trade: భారత్–రష్యా వాణిజ్యంలో కొత్త మలుపు.. 300 ఉత్పత్తులకు ఎగుమతి అవకాశాలు

India Russia Trade: భారత్–రష్యా మధ్య వాణిజ్యాన్ని 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న వేళ, భారత ఎగుమతిదారులకు భారీ అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇంజినీరింగ్ గూడ్స్, ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయం, కెమికల్స్ వంటి రంగాలకు చెందిన దాదాపు 300 ఉత్పత్తుల్లో భారత్ రష్యాకు ఎగుమతుల పెంచుకునే అవకాశముందని వెల్లడించారు. ప్రస్తుతం ఈ విభాగాల్లో భారత్ రష్యాకు చేసే ఎగుమతులు కేవలం 1.7 బిలియన్ డాలర్లకే పరిమితమై ఉండగా, రష్యా అదే ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా 37.4 బిలియన్ డాలర్లకు దిగుమతి చేసుకుంటోంది. ఈ భారీ తేడా భారత్‌కు ఉన్న అవకాశాన్ని స్పష్టంగా చూపుతోందని అధికారులు అంటున్నారు.

రష్యాతో భారత్‌కు ప్రస్తుతం 59 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఉండగా, ఎగుమతులు పెంచగలిగితే ఈ లోటును క్రమంగా తగ్గించుకునే అవకాశం ఉందని వాణిజ్య శాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా అధ్యయనం చేసి, భారత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నవి, రష్యాలో డిమాండ్ ఎక్కువగా ఉన్న ఉత్పత్తులను గుర్తించింది. ప్రస్తుతం రష్యా మొత్తం దిగుమతుల్లో భారత్ వాటా కేవలం 2.3 శాతం మాత్రమే ఉండటంతో, ముందుకు వెళ్లేందుకు పెద్ద స్కోప్ ఉందని అధికారులు చెబుతున్నారు.

రష్యా మార్కెట్‌లో భారత్ బలంగా ఉన్న రంగాలకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇంజినీరింగ్ ఉత్పత్తులు, ఫార్మా, కెమికల్స్ , వ్యవసాయ రంగాల్లో రష్యాలో డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పటికీ, భారత్ వాటాను ఇప్పటివరకు పూర్తిగా వినియోగించుకోలేకపోయింది. ఇంజినీరింగ్ గూడ్స్‌లో భారత్ ప్రస్తుతం కేవలం 90 మిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు చేస్తుండగా, రష్యా దిగుమతులు 2.7 బిలియన్ డాలర్లకు చేరాయి. అలాగే కెమికల్స్, ప్లాస్టిక్స్‌లో భారత్ వాటా 135 మిలియన్ డాలర్లు మాత్రమే కాగా, రష్యా డిమాండ్ 2.06 బిలియన్ డాలర్లు ఉంది.

ఫార్మా రంగం కూడా భారత్‌కు కీలక అవకాశంగా మారింది. భారత్ ఇప్పటికే రష్యాకు 546 మిలియన్ డాలర్ల విలువైన ఔషధాలను సరఫరా చేస్తోంది. అయితే, రష్యా మొత్తం ఫార్మా దిగుమతులు 9.7 బిలియన్ డాలర్లుగా ఉండటం వల్ల, జెనరిక్ మందులు, యాక్టివ్ ఫార్మా ఇంగ్రిడియెంట్స్ (APIలు) ద్వారా భారత్ తన వాటాను మరింత పెంచుకునే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. వ్యవసాయ రంగంలోనూ భారత్ ప్రస్తుతం 452 మిలియన్ డాలర్ల ఎగుమతులు చేస్తుండగా, రష్యా మొత్తం దిగుమతి డిమాండ్ 3.9 బిలియన్ డాలర్లు ఉండటం గమనార్హం.

ఇక దిగుమతుల విషయానికి వస్తే, ఇటీవల సంవత్సరాల్లో రష్యా నుంచి భారత్‌కు దిగుమతులు భారీగా పెరిగాయి. 2020లో 5.94 బిలియన్ డాలర్లుగా ఉన్న దిగుమతులు, 2024 నాటికి 64.24 బిలియన్ డాలర్లకు చేరాయి. దీనికి ప్రధాన కారణం క్రూడ్ ఆయిల్ దిగుమతులే. ప్రస్తుతం భారత్ దిగుమతి చేసుకునే మొత్తం చమురులో దాదాపు 21 శాతం రష్యా నుంచే వస్తోంది. చమురు కాకుండా ఎరువులు, వెజిటబుల్ ఆయిల్స్ కూడా రష్యా నుంచి దిగుమతి అవుతున్న కీలక ఉత్పత్తులుగా ఉన్నాయి.

అధిక విలువ గల రంగాలతో పాటు, టెక్స్టైల్స్, రెడీమేడ్ దుస్తులు, లెదర్ ఉత్పత్తులు, హస్తకళలు, ప్రాసెస్డ్ ఫుడ్స్, లైట్ ఇంజినీరింగ్ వంటి లేబర్ ఆధారిత పరిశ్రమలకు కూడా రష్యాలో మంచి అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్ రంగాల్లో భారత్ మార్కెట్ షేర్ 1 శాతం కంటే తక్కువగా ఉన్నప్పటికీ, డిమాండ్ మాత్రం పెద్దగా ఉందని, సరైన డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌లు, లాజిస్టిక్స్ మెరుగుపడితే భారత్ ఈ రంగాల్లో కూడా గణనీయంగా ఎదగగలదని అంచనా వేస్తున్నారు.

Just In

01

Social Media Ban: ఆస్ట్రేలియా తర్వాత 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధం విధించనున్న మరో దేశం

Panchayat Results: రెండో దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Missterious: సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతున్న “మిస్టీరియస్”

MGNREGS: సంచలనం.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు చేయబోతున్న కేంద్రం?

Balkapur Nala: క‌నుమ‌రుగ‌య్యే ప్రమాదంలో వాగు.. అధికారుల అండతో అక్రమ నిర్మాణాలు