18 People Died in Desperate Gaza For Food
అంతర్జాతీయం

Gaza Situation: బిక్కుబిక్కుమంటున్న గాజా, ఆహారం కోసం వెళ్లి 18 మంది మృతి

18 People Died in Desperate Gaza For Food : ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంతో భయానక పరిస్థితులతో పాటుగా, పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌లో విషాదఛాయలు నెలకొన్నాయి. ఓ వైపు పౌరుల మరణాలు, మరోవైపు ఆకలి కేకలతో గాజాలో పరిస్థితి దయనీయంగా మారింది. తినేందుకు తిండిలేక, తాగేందుకు నీళ్లు లేక, తలదాచుకునేందుకు గూడు లేక అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలాన్ని రోజుకో గండంలా ఎల్లదీస్తూ తిండికోసం అల్లాడిపోతున్నారు. మానవతా సాయం కోసం ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఎయిర్‌డ్రాప్ట్‌ ద్వారా జారవిడిచిన ఆహారాన్ని చేజిక్కించుకునేందుకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నానా తిప్పలు పడుతూ..సముద్ర అలలకు ప్రయత్నించి 18 మంది ప్రాణాలు కోల్పోయారు.

యుద్ధంతో తీవ్రంగా నష్టపోయిన గాజా ప్రజలను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు మానవతా సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. రోడ్డు, వాయు, సముద్ర అన్ని మార్గాల ద్వారా నిరాశ్రయులైన వారికోసం ఆహారాన్ని అందజేస్తున్నాయి.ఈ నేపథ్యంలో అమెరికా విమానాలు జారవిడిచిన ఆహారం డబ్బాలను చేజిక్కించుకునేందుకు సముద్రంలోకి వెళ్లి 18 మంది తమ నిండు ప్రాణాలను కోల్పోయారు. అందులో 12 మంది ఆహార డబ్బాలు మీద పడి మరణించగా, మరో ఆరుగురు నీటి ఉధృతికి కొట్టుకుపోయి తమ ప్రాణాలను కోల్పోయారు.ఈ విషాదకరమైన ఘటన ఉత్తర గాజాలోని బీచ్ లాహియా బీచ్‌లో చోటు చేసుకుంది.ఈ విషయాన్ని పాలస్తీనా ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

Read Also : రష్యా దాడిలో ఉక్రెయిన్‌ ప్రమేయంపై అమెరికా క్లారిటీ

ఇక ఇదే ఘటనపై పెంటగాన్‌ స్పందించింది. మానవతాసాయం కింద పంపిన 18 బండిల్స్‌లో మూడు పారాచూట్‌లు పనిచేయలేదని తెలిపింది. దీంతో అవి నీటిలో పడిపోయాయని, వాటిని చేజిక్కించుకునేందుకు వెళ్లి తమ ప్రాణాలను కోల్పోయినట్లు తెలిపింది. అయితే మరణాలకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని పేర్కొంది. గాజా బీచ్‌లో సాయంకోసం ఆహారాన్ని జారవిడవడం, మృతులను సముద్ర తీరానికి చేరుస్తున్న విషాద ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Just In

01

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్