Hyderabad City: మందుబాబులకు బిక్ షాక్.. రేపు వైన్స్ బంద్.. ఎందుకంటే? |Hyderabad City: మందుబాబులకు బిక్ షాక్.. రేపు వైన్స్ బంద్
Hyderabad City (Image Source: Meta AI)
హైదరాబాద్

Hyderabad City: మందుబాబులకు బిక్ షాక్.. రేపు వైన్స్ బంద్.. ఎందుకంటే?

Hyderabad City: వీకెండ్ అంటే మందుబాబులకు పెద్ద పండగే అని చెప్పాలి. ముఖ్యంగా ఉద్యోగులు.. వారంలో పడిన కష్టాన్నంతా ఆదివారం (Sunday) రోజు మంచిగా చిల్ అవుతూ మర్చిపోతారు. తద్వారా కొత్త వారంలో ఉత్సాహంగా పనిచేసేందుకు సిద్ధమవుతారు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ వీకెండ్ కల్చర్ బాగా కనిపిస్తుంటుంది. అటువంటిది ఈ ఆదివారం మందుబాబులకు పీడకలే అని చెప్పాలి. వీకెండ్ లో వైన్స్ ను బంద్ చేస్తూ రాచకొండ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు.

బంద్ ఎందుకంటే?
శ్రీరామనవమి (Sri Rama Navami) పర్వదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ (Hyderabad) లో మద్యం దుకుణాలను (Wine Shops) మూసివేయాలని సైబరాబాద్ కమీషనరేట్ (Cyberabad Commissionerate) ఉత్తర్వులు జారీ చేసింది. ఆదివారం రోజున నగరంలోని వైన్స్ షాపులను బంద్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. శ్రీరాముడి నామస్మరణతో నగరమంతా మార్మోగనున్న నేపథ్యంలో.. ఎలాంటి అవాంఛిత ఘటనలు చెలరేగకుండా పోలీసులు శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య మద్యం అమ్మకాలు నిలిచిపోనున్నాయి.

అతిక్రమిస్తే కఠిన చర్యలు
పోలీస్ ఉత్తర్వులకు విరుద్దంగా ఎవరైనా మద్యాన్ని విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ కమిషనరేట్ స్పష్టం చేసింది. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయనున్నట్లు పేర్కొంది. కాబట్టి వైన్స్ షాపు యజమానులు పోలీస్ శాఖ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేసింది. నగరంలోని వైన్స్ షాపులపై పోలీసుల నిఘా కొనసాగనున్నట్లు తెలుస్తోంది.

Also Read: CM Revanth Reddy: సీఎం రేవంత్ పై హైటెక్ కుట్రలు.. ఫేక్ వీడియోల హల్ చల్.. నెటిజన్స్ ఫైర్..

వాటికి మినహాయింపు
మద్యం విక్రయాలకు సంబంధించి కొన్నింటికి సైబరాబాద్ పోలీసులు మినహాయింపు ఇచ్చారు. స్టార్ హోటల్స్ (Hyderabad Star Hotels)లోని బార్లు, రిజిస్టర్డ్ క్లబ్స్ (Clubs)లో మద్యం అమ్ముకునేందుకు వీలు కల్పించారు. అయితే అక్కడ ఏదైనా సమస్యలు తలెత్తితే దానికి నిర్వహకులే బాధ్యత వహించాల్సి ఉంటుంది.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?