Rain Alert in Hyderabad: హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఉదయం నుండి భీకర వడగాల్పులు వీయగా, ఒక్కసారిగా సాయంత్రం ఆకాశం మేఘావృతమైంది. దీనితో మరికొద్ది గంటల్లో హైదరాబాద్ నగరంలో భారీ ఈదురుగాలులతోపాటు, పలు ప్రదేశాలలో మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ పరిశీలకులు తెలుపుతున్నారు.
ఇటీవల హైదరాబాద్ నగరానికి రోజుల వ్యవధిలో వరుణుడు కరుణిస్తూ వాతావరణాన్ని చల్లబరుస్తున్నాడు. అయితే గత మూడు రోజులుగా తీవ్ర ఎండ ప్రభావంతో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం 9 గంటల సమయానికే భానుడి ప్రతాపం అధికం కావడంతో వృద్ధులు, చిన్నారులు బయటకు వచ్చేందుకు సాహసించని పరిస్థితి. కానీ ఆదివారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు భానుడి ప్రతాపం అధికంగా ఉండగా, సాయంత్రం పూట ఒక్కసారిగా వాతావరణం మార్పు చెందింది.
ఆకాశం మేఘావృతం కాగా, మరికొద్ది గంటల్లో భీకర గాలులు, మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ పరిశీలకు తెలుపుతున్నారు. దీనితో నగర ప్రజలకు వేడిగాలుల నుండి కాస్త ఉపశమనం లభించే అవకాశం ఉంది. వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జిహెచ్ఎంసి అధికారులు సైతం అప్రమత్తమయ్యారు.
Also Read: Osmania Hospital: ఉస్మానియా ఆస్పత్రి వైద్యుల అరుదైన ఘనత.. ఏమిటంటే!
గత వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు అక్కడక్కడ నేలకొరిగిన వృక్షాలను తొలగించే కార్యక్రమాన్ని యుద్ద ప్రాతిపదికన జిహెచ్ఎంసి చేపట్టింది. అంతేకాకుండా విద్యుత్ శాఖ అధికారులు సైతం ఎప్పటికప్పుడు విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. మళ్లీ హైదరాబాద్ నగరంలో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు సమాచారం ఉండడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.
A large cloud covering Entire Hyderabad city now. Which will give strong winds & showers ☔ pic.twitter.com/WBRzJ2x1JL
— Vizag weatherman🇮🇳 (@KiranWeatherman) April 27, 2025