Hyderabad: గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) వాసుల దాహార్తిని తీర్చే జలమండలి, నగరంలోని పలు ప్రాంతాల్లో నేడు నాడు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు ప్రకటించింది. కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ (కేడీడబ్ల్యూఎస్పీ) ఫేజ్-3, పంపింగ్ మెయిన్‌కు సంబంధించి 2375 ఎంఎం డయా పైప్‌లైన్‌కు ఏర్పడిన భారీ లీకేజీని అరికట్టడానికి మరమ్మతులు చేపడుతుండడమే దీనికి కారణం.
కోదండాపూర్(Kodandapur) నుంచి గొడకొండ్ల(Godakondla) వరకు సరఫరా చేసే ఈ ప్రధాన పైప్‌లైన్‌లో లీకేజీతో పాటు ఎయిర్ వాల్వ్, గేట్ వాల్వ్ వంటి పని చేయని వాల్వ్‌లను మార్చే పనులను సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు (మొత్తం 36 గంటల పాటు) చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. కృష్ణా ఫేజ్-3లోని రింగ్ మెయిన్-1 కింద ఉన్న రిజర్వాయర్ల పరిధిలో ఈ నీటి సరఫరా నిలిచిపోనుంది.
Also Read: PCC Mahesh Kumar Goud: ఖాళీగా ఉన్న కేంద్ర రాష్ట్ర పోస్టులను భర్తీ చేయాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్
ఈ ప్రాంతాల్లోనే..
గచ్చిబౌలి, కొండాపూర్, మాధాపూర్, అయ్యప్ప సొసైటీ, కావూరి హిల్స్, ప్రశాసన్ నగర్, ఫిల్మ్‌నగర్, జూబ్లీ హిల్స్, తట్టి ఖానా, భోజగుట్ట, షేక్‌పేట్, హకీంపేట్, కర్వాన్, మెహిదీపట్నం, ఆసిఫ్‌నగర్, గోల్కొండ, లంగర్ హౌజ్, దుర్గా నగర్, బుద్వెల్, సులేమాన్ నగర్, గోల్డెన్ హైట్స్, కిస్మత్‌పూర్, గంధంగూడ, బండ్లగూడ, శాస్త్రిపురం, అల్లబండ, మధుబన్, ధర్మసాయి (శంషాబాద్), సాహేబ్‌నగర్, ఆటోనగర్, సరూర్‌నగర్, వాసవి నగర్, నాగోల్, ఎన్‌టీఆర్ నగర్, వనస్థలిపురం, దేవేందర్ నగర్, ఉప్పల్, స్నేహపురి, భారత్ నగర్, రాంపల్లి, బోడుప్పల్, చెంగిచెర్ల, మానిక్ చంద్, మల్లికార్జున నగర్, పీర్జాదిగూడ, పెద్ద అంబర్‌పేట్ వంటి పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయమేర్పడనుంది. ఈ నేపథ్యంలో వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి సూచించింది.
Also Read: Bhadradri Kothagudem: ఆ జిల్లాలో అధిక వర్షాలతో.. నీట మునిగిన పంటలు అన్నదాతల అవస్థలు
