Vice President : ఉపరాష్ట్రపతి జగ్ దీప్ ధన్ ఖర్ నేడు ఆదివారం తెలంగాణకు రాబోతున్నారు. సంగారెడ్డి జిల్లాలోని కందిలో ఉన్న ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ కు ఆయన విచ్చేస్తున్నారు. అక్కడ స్టూడెంట్లతో ఆయన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఆయన కార్యక్రమం ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేదు.
కేవలం విద్యార్థుల ప్రోగ్రామ్ కోసమే ఆయన రాబోతున్నారు. ఈ ఐఐటీలో గవర్నమెంట్ స్టూడెంట్లు కొన్ని సైన్స్ ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు. వాటిని కూడా ఉపరాష్ట్రపతి సందర్శించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కలెక్టర్ వల్లూరు క్రాంతి ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి కలిసి హెలిపాడ్ ప్రాంతాన్ని క్యాంపస్ పరిసరాలను పరిశీలించారు. సంగారెడ్డిలో పోలీసులు ఆంక్షలు విధించారు.