Senior Citizens: భలే.. భలే ఎంజాయ్ చేసిన సీనియర్ సిటిజన్లు
Senior Citizens (imagecredit:swetcha)
హైదరాబాద్

Senior Citizens: భలే.. భలే వన్ విమాన హోటల్.. ఎంజాయ్ చేసిన సీనియర్ సిటిజన్లు

Senior Citizens: ఆరు పదుల వయస్సులో ఉన్న సీనియర్ సాథీలకు ఊహించని, మరపురాని మధురానుభూతి దక్కింది. హైదరాబాద్(Hyderabad) జిల్లా పరిధిలోని సీనియర్ సాథీ కార్యక్రమం కింద ఓం ఫర్ ది డిజేబుల్ ఏజ్డ్, లిటిల్ సిస్టర్స్ ఓల్డ్ ఏజ్ హోమ్ కు చెందిన 40 మంది సీనియర్ సిటిజన్లను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి ప్రత్యేక చొరవతో గురువారం దుండిగల్ లోని గండి మైసమ్మ టెర్మినల్ వన్ విమాన హోటల్‌కి తీసుకేళారు. విమానంలో ఏర్పాటు చేసిన ఈ హోటల్ లో సీనియర్ సిటిజన్లు ఎలాంటి మోహమాటం లేకుండా తమకు నచ్చిన విధంగా ఎంజాయ్ చేస్తూ, కలెక్టర్ కు ధన్యవాదాలు తెలియజేసినట్లు సంకల్ప స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు రోజి తెలిపారు.

సీనియర్ సాథీల అభిరుచి

ఈ కార్యక్రమంలో భాగంగా వయోధికులు ఆనందంగా పాల్గొనే విధంగా చిన్న చిన్న ఆటలు, పాటలు వినోదాత్మక కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమాలు వృద్ధులలో మానసిక ఉల్లాసాన్ని పెంచడంతో పాటు సామాజిక పరిచయాలు పెరిగేందుకు ఎంతగానో దోహదపడతాయని ఆమె అభిప్రాయపడ్డారు. సీనియర్ సాథీల అభిరుచిని దృష్టిలో ఉంచుకుని వారికష్టమైన ఆహార పదార్థాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయించారు. కార్యక్రమం ముగిసిన తర్వాత, ప్రతి వయోధికుడినీ క్షేమంగా, తిరిగి ఆయా వృద్ధాశ్రమాలకు చేరవేశారు.

విరాళం సహకారంతో..

ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ సూచనల మేరకు సంకల్ప ఆర్గనైజేషన్, వసుంధర డైమండ్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విరాళం సహకారంతో విజయవంతంగా నిర్వహించినట్లు స్వచ్చంద సంస్థల నిర్వాహకులు తెలిపారు. వృద్ధుల ఆనందం, సంతోషభావం, వారి ముఖాలపై కనిపించిన చిరునవ్వులు ఈ కార్యక్రమానికి సార్థకతను చేకూర్చాయని వ్యాఖ్యానించారు. ఎంతో విజయవంతంగా నిర్వహించిన ఈ సీనియర్ సాథీల కార్యక్రమం రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తుందని స్వచ్చంద సంస్థల నిర్వాహకులు వెల్లడించారు.

Also Read: Shobha Shetty VS Divya: ‘చిక్కులు, దిక్కులు, లెక్కలు’ టాస్క్ విజేత ఎవరు? యోధురాలిని దివ్య ఓడించిందా?

Just In

01

NTR – Bharat Ratna: ఎన్టీఆర్‌కు భారతరత్న.. ఇంకా ఎంతకాలమీ సాగదీత.. ఈ ప్రశ్నలకు సమాధానాలెక్కడ?

Medaram Jatara 2026: మేడారం భక్తులకు గుడ్ న్యూస్.. జాతరలో ఆ భయం లేదిక..?

Naresh Birthday: నరేష్ 30 నిమిషాలు కేటాయిస్తే గొప్ప.. పవిత్ర లోకేష్.. ఏం చేస్తారంటే?

University Recruitment: ఉద్యాన వర్సిటీ ప్రతిష్ట దెబ్బతీస్తే ఉపేక్షించం.. నియామకాలపై కుట్రలెందుకు..?

Gadwal News: గత రికార్డును బ్రేక్ చేసేలా.. విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న గద్వాల ఉపాధ్యాయులు