Shakeel Son accident case ( image credit: twitter)
హైదరాబాద్

Shakeel Son accident case: పోలీసుల దర్యాప్తులో షాకింగ్ ట్విస్ట్.. షకీల్ కుమారుడి బదులు ఉద్యోగి అరెస్ట్!

Shakeel Son accident case: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2023,డిసెంబర్ లో షకీల్ కుమారుడు రాహిల్ మద్యం మత్తులో ప్రజా భవన్ ఎదురుగా ఉన్న ట్రాఫిక్ బారికేడ్లను ఢీ కొట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో షకీల్ కొడుకును తప్పించి తన వద్ద పని చేస్తున్న ఉద్యోగిని పోలీసుల వద్ద సరెండర్ చేయించాడు. దీనికి అప్పట్లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సీఐగా ఉన్న దుర్గారావుతోపాటు బోధన్ సీఐ సహకరించారు. కాగా, వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ జరిపిన విచారణలో రాహిల్ యాక్సిడెంట్ చేసినట్టుగా వెళ్లడయ్యింది.

Also Read: MLA Danam Nagender: దానం వ్యాఖ్యల వెనక మతలబు ఏమిటీ?.. వెనక్కి వెళ్తారా?.. కాంగ్రెస్ లోనే కొనసాగుతారా?

ఈ క్రమంలో రాహిల్ తోపాటు మాజీ ఎమ్మెల్యే షకీల్ ను కేసులో నిందితునిగా చేర్చారు. ఆ వెంటనే షకీల్ దుబాయ్ వెళ్లిపోయారు. ఇటీవల తన తల్లి అంత్యక్రియల నిమిత్తం అతను రాగా ఎయిర్ పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తల్లి అంత్యక్రియలు ఉన్నాయని చెప్పటంతో దానికి అనుమతించారు.

కాగా, అంత్యక్రియలు ముగిసిన నేపథ్యంలో షకీల్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు నాంపల్లిలోని అదనపు ఛీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచారు. షకీల్ పై నమోదైన కేసుల్లో 7సంవత్సరాలలోపు శిక్ష పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అతనికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ganja Racket: గంజాయి బ్యాచ్ అరెస్ట్! .. ఎలా దొరికారో తెలుసా?

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!