DGP Jitender: మారుతున్న పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అమలు చేసే అంతర్గత సంస్కరణలు పోలీసుల ప్రతిష్టను పెంచుతాయని డీజీపీ డాక్టర్ జితేందర్ చెప్పారు. సంస్కరణలు పోలీసుల సామర్థ్యాన్ని పెంచుతాయని చెప్పారు. ఇండియన్ పోలీస్ ఫౌండేషన్…తెలంగాణ పోలీసు శాఖ కలిసి రాష్ట్రంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టులో భాగంగా మొదట సైబరాబాద్ కమిషనరేట్, సంగారెడ్డి జిల్లాలో కలిపి 30 పోలీస్ స్టేషన్లలో వీటిని అమల్లోకి తీసుకు రానున్నారు. ఈ మేరకు ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ తో తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.
Also Read: Jangaon Politics: జనగామ రాజకీయాల్లో తెరముందు శత్రుత్వం తెరవెనుక మిత్రుత్వం.. ఇవన్నీ దేనికి సంకేతం!
మహిళల కోసం ప్రవేశ పెట్టిన టీ సేఫ్ యాప్
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ఇప్పటికే తెలంగాణ పోలీసులు అమలు చేస్తున్న మీ సేవ, పోలీస్ స్టేషన్లలో క్యూ ఆర్ కోడ్ వ్యవస్థ, సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీ, మహిళల కోసం ప్రవేశ పెట్టిన టీ సేఫ్ యాప్ తదితర ప్రాజెక్టులను ప్రస్తావించారు. వీటి వల్ల ఇటు పోలీసుల పనితీరు మెరుగు కావటంతోపాటు ప్రజలకు కూడా ప్రయోజనాలు కలుగుతున్నాయన్నారు. ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రిటైర్డ్ డీజీపీ ఓం ప్రకాశ్ సింగ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పరిశోధన, పోలీసుల సామర్థ్య అభివృద్ధి, పోలీసింగ్ లో మెరుగులే లక్ష్యంగా తమ సంస్థ పని చేస్తున్నట్టు చెప్పారు.
మహిళల భద్రత పెరుగుతుంది
ఇప్పటిక హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, కేరళ, ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ విభాగాలు ఏర్పాటైనట్టు చెప్పారు. సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్, తెలంగాణ విజిలెన్స్ రిటైడ్ డీజీ ఈష్ కుమార్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ ద్వారా పౌరుల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ, మహిళల భద్రత పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ ప్రతినిధి దుర్గాప్రసాద్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శరత్ కుమార్, అదనపు డీజీపీలు మహేశ్ భగవత్, అనిల్ కుమార్, సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, ఐజీలు చంద్రశేఖర్ రెడ్డి,న రమేశ్, తఫ్సీర్ ఇక్భాల్, సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Supreme Court: వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. స్టే ఇచ్చేందుకు నిరాకరణ
