Koheda Fruit Market: అంతర్జాతీయ ప్రమాణాలతో కోహెడ​​ మార్కెట్!
Koheda Fruit Market (imagecredit:swetcha)
రంగారెడ్డి, హైదరాబాద్

Koheda Fruit Market: అంతర్జాతీయ ప్రమాణాలతో కోహెడ​ ఫ్రూట్​ మార్కెట్..​ త్వరలో ప్రారంభం..!

Koheda Fruit Market: అంతర్జాతీయ ప్రమాణాలతో కోహెడ్​ ఫ్రూట్​ మార్కెట్
–199 ఎకరాల విస్తీర్ణంలో రూ.2901కోట్ల వ్యయంతో నిర్మాణానికి ప్రతిపాదనలు
–వివిధ మార్కెట్ల సహాయంతో మార్కెట్​ ఖజానాలో రూ.314 కోట్లు
–మిగిలిన నిధులను సమీకరించేందుకు ఫ్రూట్​ మార్కెట్​ అధికారులు ప్రయాత్నం
–ప్రభుత్వ సహాయం కోసం మార్కెట్ చైర్మన్​, డైరెక్టరేట్​ ఆఫ్​ కమిషనర్​ సీఎంకు నివేధిక
–ఒకే ధపాలో నిర్మాణానికి ప్రణాళికలు సిద్దం
–త్వరలోనే సీఎం రేవంత్​ రెడ్డి చేతుల మీదుగా శంఘుస్ధాపన కార్యక్రమం
స్వేచ్ఛ, రంగారెడ్డి బ్యూరో: దేశంలోనే అతిపేద్ద మార్కెట్​గా నగరంలోనున్న గడ్డిఅన్నారం మార్కెట్​కు పెరుంది. ఈ పేరును అదే స్థాయిలో నిలబెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అయితే గత ప్రభుత్వ హాయంలో ఔటర్​ రింగు(ORR) రోడ్డుకు సమీపంలో సుమారుగా 200 ఎకరాల స్థలంను సేకరించి పండ్ల మార్కెట్​కు అప్పగించింది. అంతేకాకుండా ఫ్రూట్​ మార్కెట్​ అధీనంలోనున్న వివిధ మార్కెట్ల సహాయంతో రూ.314కోట్లు జమ చేయడం జరిగింది. కానీ ఈ నిధులతో ఫ్రూట్​ మార్కెట్​ నిర్మాణం పూర్తి చేసే పరిస్థితి లేకపోవడంతో మరిన్ని నిధుల సహకారం కోసం అధికారులు, మార్కెట్​ కమిటీ చైర్మన్​ ఇతర ప్రత్యమ్నాయ పద్దతులను వెతుకుతున్నారు. ప్రపచ స్ధాయిలో ఈ ఫ్రూట్​ మార్కెట్ నిర్మాణం కొనసాగించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రయాత్నం చేస్తున్నారు.

రూ.2901కోట్లకు ప్రతిపాదనలు..

గడ్డిఅన్నారంలోనున్న మార్కెట్​ను విస్తరించాలనే లక్ష్యంతో ఔటర్​కు అందుబాటులో ఉండేవిధంగా భూ సేకరణ చేశారు. అబ్ధుల్లాపూర్​మెట్టు మండలం కోహెడ్​ గ్రామ పంచాయతీ పరిధిలోరూ.350కోట్లు విలువ చేసే 199 ఎకరాల భూమిని మార్కెట్​ నిర్మాణానికి ప్రభుత్వం అప్పగించింది. ఈ స్థలంలో నిర్మాణాలు చేపట్టేందుకు రూ.2901కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే రూ.314 కోట్లు 65 మార్కెట్ కమిటీల సహాయంతో ఫ్రూట్​ మార్కెట్ ఖజానాలో జమ చేయడం జరిగింది. మరో252 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సహకారం, మరో రూ.1128 కోట్లు జైకా నిధుల కోసం, రూ.840కోట్లు పీపీబీ పద్దతిలో నిధులు సేకరించాలని మార్కెటింగ్​ అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ ప్రతిపాదనలన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధత అధికారులు నివేధికలు పంపారు. సీఎం రేవంత్​ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నివేధికకు గ్రీన్​సిగ్నల్​ ఇవ్వగానే శంఘుస్ధాపన జరుగుతుందని తెలుస్తోంది. మార్చి మొదటి వారంలో సీఎం ఫ్రూట్​ మార్కెట్​ నిర్మాణంపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉందని సమాచారం.

Also Read: TG Global Summit: గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణానికి పోటెత్తిన జనం.. టూరిజంపై సదస్సు.. విద్యార్థులు, ప్రజల సందడి!

విశాలమైన హంగులతో వసతుల నిర్మాణం..

ఈ మార్కెట్​ నిర్మాణంలో ప్రధానంగా జీప్లస్​ ఫోర్​ ఆడ్మిన్​ బ్లాక్​, ఫారన్​ ఎక్స్​ఫోర్ట్​, వాల్​మార్ట్, సూపర్​ మార్కెట్​ గదులు, టాయిలెట్​, ఫైర్​ స్టేషన్​, పోలీస్​ ఔట్​లేట్​, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఫార్మర్​ రేస్ట్​ హౌస్​, స్టిల్​ డవలప్​మెంట్​ కార్యాలయం, అన్​కేంర్​ స్టోరీస్​, కోల్డ్​స్టోరేజీ, గోధాములు, పెట్రోల్​ పంపు, హెరిడేషన్​ సెంటర్​ 6ఎకరాల 25గుంటల్లో, వేర్​హౌసింగ్​ 10 ఎకరాల్లో, సబ్​స్టేషన్​ 5 ఎకరాల్లో నిర్మించాలని పెద్ద ప్రణాళికలను రూపోందించారు. అంతేకాకుండా వాహనాల రాకపోకలకు అనువైన రోడ్లు నిర్మాణానికి వచ్చిపోయే రహదారుల విశాలంగా చేపట్టాలని ప్రతిపాదనలు సిద్దం చేశారు. అటు రైతులకు, ఇటు వాహనాదారులు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు ఎక్కడిక్కడ సులభంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటామని వివరిస్తున్నారు.

త్వరలోనే పరిపాలన అనుమతి: చిలుక మధుసూదన్​ రెడ్డి, మార్కెట్​ కమిటీ చైర్మన్

మార్కెట్‌ నిర్మాణానికి పరిపాలన అనుమతుల కోసం ప్రభుత్వానికి పంపడం జరిగింది. మార్చి మొదటి వారంలో సీఎం గ్రీన్​ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. పరిపాలన అనుమతులు వచ్చిన తక్షణమే నిర్మాణ పనులకు సీఎం చేతుల మీదుగా శంఘుస్ధాపన నిర్వహిస్తాము. ఇప్పటికే అధికారులు పూర్తిగా సర్వే పనులు చేసి నివేధిక ప్రభుత్వానికి పంపారు. ప్రస్తుత మార్కెట్​లో ఏలాంటి సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు అధికారులతో కలిసి చర్యలు చేపడుతున్నాము. ఫ్రూట్​ మార్కెట్​తో పాటు, పూలు, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, ఎండుమిర్చిలకు సంబంధించిన మార్కెట్​ను కూడా పెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు.

పక్క ప్రణాళికతో అడుగులు: పి.శ్రీనివాస్​, ఫ్రూట్​ మార్కెట్ కార్యదర్శి

ప్రూట్​ మార్కెట్​ నిర్మించబోయే ప్రాంతాన్ని స్వయంగా మార్కెటింగ్​ శాఖ డైరెక్టర్​ సురేంద్రమోహన్​తో పాటు ఇతర అధికారులు స్థలాన్ని పరిశీలించారు. ఎక్కడెక్కడ ఏవిధమైన నిర్మాణాలు చేపట్టాలనే ప్రతిపాదనలు సైతం ఉన్నతాధికారులు పరిశీలించారు. అతి త్వరలోనే ఫ్రూట్​ మార్కెట్​ నిర్మాణానికి అడుగులు పడుతాయని అనుకుంటున్నాము. ప్రపంచ స్ధాయిలో అన్ని హంగులతో నిర్మించేందుకు అవసరమైన నిధుల సేకరణలో ప్రభుత్వం నిమగ్నమైయింది. రైతులకు ఏలాంటి సమస్యలు లేకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోని నిర్మాణం జరుగుతుంది.

Also Read: Local Body Elections: గజ్వేల్‌లో కాంగ్రెస్ జెండా ఎగరనుందా.. ప్రముఖుల గ్రామాల్లో ఉత్కంఠ ఫలితాలు

Just In

01

Messi Mania: ఉప్పల్‌లో మెస్సీ మేనియా.. ఉర్రూతలూగుతున్న స్టేడియం

Thummala Nageswara Rao: రబీకి సరిపడా యూరియా కోసం.. కేంద్ర మంత్రులకు మంత్రి తుమ్మల లేఖ

KTR: పోగు బంధంతో ఫోన్ బంధం.. సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి..!

DekhLenge Saala Released: ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ‘దేఖ్ లెంగే సాలా’ వచ్చేసింది.. పవర్ స్టార్ స్వాగ్ పీక్స్!

Uttam Kumar Reddy: పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ