HCU Bandh: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూముల వ్యవహారంలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. HCU భూముల అమ్మకం, వాటి వినియోగంపై ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ భూములు యూనివర్సిటీ విద్యా ప్రయోజనాల కోసం కేటాయించబడ్డాయని, వాటిని వాణిజ్య లాభాల కోసం ఉపయోగించడం సరికాదని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో, విద్యార్థి సంఘాలు యూనివర్సిటీ బంద్‌కు పిలుపునిచ్చాయి.
క్యాంపస్‌లో ఆందోళనలు కొనసాగుతుండగా, విద్యార్థులు ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈ ఆందోళనల్లో విద్యార్థులతో పాటు బయటి వ్యక్తులు కూడా చొరబడి పాల్గొంటున్నారని, విద్యార్థి ముసుగులో ఇతరులు ఉద్యమాన్ని తమ లక్ష్యాల కోసం ఉపయోగించుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విద్యార్థులను రెచ్చగొట్టి, ఆందోళనలకు పురిగొల్పే ప్రయత్నం జరుగుతోందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా, గతంలో ఈ భూములపై న్యాయపోరాటం చేసిన బీఆర్‌ఎస్ ఇప్పుడు ఆందోళనలకు మద్దతు తెలపడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ గతంలో ఈ భూములు ప్రభుత్వ స్వంతమని వాదించిందని గుర్తు చేస్తున్నారు. అయితే, ఇప్పుడు అదే బీఆర్‌ఎస్ ఆందోళనలకు మద్దతు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజకీయంగా దెబ్బతీయాలని, బదనాం చేయాలని ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
Also Read: కేసీఆర్‌కు బిగ్ షాక్.. బీఎర్ఎస్ ఎమ్మెల్యే యూటర్న్.. సీఎం రేవంత్‌పై ప్రశంసల వర్షం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూములను పరిశీలించేందుకు బయల్దేరిన బీజేపీ ఎమ్మెల్యేల బృందాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ సంఘటన హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యేలు HCU భూముల సమస్యపై స్థానికంగా తనిఖీ చేసేందుకు వెళ్లాలని నిర్ణయించుకోగా, పోలీసులు వారిని అనుమతించకుండా అడ్డగించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర బీజేపీ ఎమ్మెల్యేలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసులు బీజేపీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి, వారిని అదుపులోకి తీసుకున్నారు. పాయల్ శంకర్‌తో సహా ఇతర ఎమ్మెల్యేలు ఈ ఘటనలో పాల్గొన్నట్లు సమాచారం.
HCU భూముల విషయంలో బీజేపీ ఎమ్మెల్యేలు చేపట్టాలనుకున్న పరిశీలనకు పోలీసులు అడ్డంకి కల్పించడంతో ఈ వివాదం మరింత రాజకీయ రంగు పులుముకుంది. ఎమ్మెల్యేలు సెంట్రల్ యూనివర్సిటీ భూముల దగ్గరకు వెళ్లకుండా నిరోధించడంతో వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటనతో హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Also Read: హెచ్ సీఏ, ఎస్ఆర్ హెచ్ మధ్య కొనసాగుతున్న మెయిల్ వార్
HCU భూముల సమస్యలో గతంలో ప్రతిపక్షంగా ఉన్న భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) కీలక పాత్ర పోషించింది. బీఆర్‌ఎస్, అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) HCU భూములు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని, ఇవి స్థానిక ప్రజల సొత్తుగా పరిగణించాలని వాదించింది. ఈ విషయంలో బీఆర్‌ఎస్ నాయకులు యూనివర్సిటీ యాజమాన్యంతో పాటు కేంద్ర ప్రభుత్వంపైనా తీవ్ర విమర్శలు చేశారు. వారి వాదన ప్రకారం, HCU భూములు రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులుగా ఉండాలని, వీటిని స్థానిక అవసరాల కోసం వినియోగించుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ప్రస్తుత ఈ భూములపై ఆందోళనకు మద్దతు పలకడం ఆ పార్టీ ద్వంద వైఖరీకి అద్దం పడుతోంది.
సీఎం సమీక్ష ..
HCU భూముల వ్యవహారంపై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్‌గా స్పందించారు. ఈ విషయంపై మంత్రులతో కమాండ్ కంట్రోల్ రూమ్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ భూముల విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని, ఆందోళనలను అదుపు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.