Hydraa Complaints (imagcredit:Twitter)
హైదరాబాద్

Hydraa Complaints: అక్రమ నిర్మాణాలపై భారీగా అందుతున్న ఫిర్యాదులు

Hydraa Complaints: చెరువులు, నాలాలు, పార్కుల‌ ఆక్ర‌మ‌ణ‌ల‌పై హైడ్రా(Hydra)కు అందుతున్న ఫిర్యాదులు ప్రతి వారం పెరుగుతున్నాయి.  చెరువుల ఆక్ర‌మ‌ణ‌ల‌తో పాటు కాల‌నీల్లో ఎంతో ముఖ్యంగా భావించే పార్కుల‌ను కూడా క‌బ్జా చేసి, ప్లాట్లుగా విక్ర‌యిస్తున్నార‌ని ప‌లువురు ఫిర్యాదు చేశారు. హైడ్రా ప్ర‌జావాణికి ఇలా మొత్తం 52 ఫిర్యాదులు అందినట్లు హైడ్రా అధికారులు తెలిపారు.

క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌

వ‌ర‌ద కాలువ‌లు అయితే 6 మీట‌ర్ల మేర ఉండాల్సిన‌వి కొన్ని ప్రాంతాల్లో కేవ‌లం 2 మీట‌ర్ల‌కే ప‌రిమిత‌మ‌య్యాయ‌నే ఫిర్యాదులు కూడా అందాయి. చెరువులు అలుగులు పారే స‌మ‌యంలో, 5 సెంటీమీట‌ర్ల‌కు పైగా వ‌ర్షం ప‌డిన‌ప్పుడు కాల‌నీలు నీట మున‌గ‌డం స‌ర్వ సాధార‌ణంగా మారాయ‌న్నారు. హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌ (AV. Ranganadh) ఈ ఫిర్యాదుల‌ను గూగుల్ మ్యాప్స్(Google Maps) ద్వ‌ారా ప‌రిశీలించి సంబంధిత అధికారుల‌కు వాటిని అప్ప‌గించి త‌దుప‌రి చ‌ర్య‌ల‌కు ఆదేశించారు.

ఫిర్యాదులు ఇలా

మియాపూర్‌లోని హెచ్ఎంటీ(HMT) స్వర్ణపురి కాలనీలో ర‌హ‌దారిని క‌బ్జా చేసి అడ్డుగా ప్ర‌హ‌రీ నిర్మించార‌ని కొందరు ఫిర్యాదు సమర్పించారు. ఈ రోడ్డును తన పూర్వీకుల ఆస్తిగా పేర్కొంటూ తొమ్మిది నెలల క్రితం ఫ్రీకాస్ట్ వాల్(Free Cost Wall) నిర్మించారు. అంతేకాకుండా, అక్కడ ఒక గదిని నిర్మించి అద్దెకు ఇచ్చినట్టు, అదనంగా తాత్కాలిక షెడ్‌లను కూడా ఒక మెకానిక్‌కి అద్దెకిచ్చినట్టు ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. మేడ్చల్(Medchel) జిల్లా అల్వాల్(Alwall) పరిధిలోని రిట్రీట్ కాలనీలో నాలా ఆక్ర‌మ‌ణ జ‌రిగిందంటూ నివాసితులు ఫిర్యాదు చేశారు.

Also Read: Arvind Dharmapuri: కేసీఆర్ ఫ్యామిలీని గప్పా గప్పా గుద్ది.. రప్పా రప్పా జైల్లో వేయాలి.. బీజేపీ ఎంపీ

నాలా ప్రవాహాన్ని అడ్డుకోవ‌డంతో

లాయోలా కాలేజ్(Layola Collage) సమీపంలో 12 అడుగుల నాలాపై ఓయో గదులు నిర్మించడంతో పాటు, బహుళ అంతస్తుల భవనం కూడా నిర్మించారని వారు ఫిర్యాదు అందినట్లు హైడ్రా(Hydra) అధికారులు తెలిపారు. నాలా ప్రవాహాన్ని అడ్డుకోవ‌డంతో సమస్యలు త‌లెత్తుతున్నాయ‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. శేరిలింగంపల్లి మండలం, కొండాపూర్‌లోని కాంతీవ‌నం కాలనీలో 2220 గజాల  పార్కును ఆక్రమించేందుకు క‌బ్జాదారులు ప్రయత్నిస్తున్నారని కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. 218/11, 12, 13 స‌ర్వే నంబ‌ర్ల‌లో ఉన్న ఈ భూమి 1974లో అధికారికంగా ఆమోదించబడిందని, 1996 నుంచి ఈ పార్క్‌ను వాకింగ్ కోసం వినియోగిస్తూ వస్తున్నారు.

పార్క్‌ను రక్షించాల‌ని

జీహెచ్ఎంసీ(GHMC) పార్కు చుట్టూ ప్ర‌హ‌రీ నిర్మించ‌డానికి నిధులు కూడా మంజూరు చేసినా, ప‌నులను అడ్డుకుంటున్నార‌ని, పార్క్‌ను రక్షించాల‌ని ఫిర్యాదుదారులు కోరారు. రంగారెడ్డి(Ranga Reddy) జిల్లా అబ్దుల్లాపూర్‌పేట్ మండ‌లం, కొహెడ గ్రామ ప‌రిధిలోని 141 స‌ర్వే నంబ‌రులో13 ఎక‌రాల పిట్టె చెరువును మాయం చేస్తున్నార‌ని, స్థానికులు ఫిర్యాదు చేశారు. వ‌ర్షం(Rain) ప‌డితే వ‌ర‌ద నీరు నేరుగా ఈ చెరువుకు చేరేద‌ని  క‌బ్జాతో చెరువుల అనుసంధానం కూడా త‌గ్గింద‌ని పేర్కొన్నారు. ఈ చెరువును పున‌రుద్ధ‌రిస్తే వ‌ర‌ద ముప్పు ఆ ప‌రిస‌ర ప్రాంతాల వారికి త‌గ్గుతుంద‌ని పలువురు ఫిర్యాదుదారులు తాము సమర్పించిన ఫిర్యాదుల్లో హైడ్రా(Hydra)కు వివరించారు.

Also Read: Samantha and Raj Nidimoru: అదే జరిగితే సమంత సినిమాలతో పాటు డైరెక్టర్ రాజ్ కు గుడ్ బై?

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ