SriRamaNavami Shobhayatra: శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా హైదరాబాద్‌లో భక్తిశ్రద్ధలతో శోభాయాత్రను నిర్వహిస్తున్నారు. మంగళ్ హాట్ సీతారాం భాగ్ నుంచి ఈ శోభాయాత్ర మధ్యాహ్నం ఒంటి గంటకు ర్యాలీగా మొదలైంది. సీతారాం భాగ్ నుండి ప్రారంభమై సుల్తాన్ బజార్ హనుమాన్ వ్యాయామశాల వరకు శోభాయాత్ర చేరుకోనుంది.
మొత్తం 6.3 కిలో మీటర్ల వరకు ఈ శోభాయాత్ర సాగనుంది. 20 వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. శోభాయాత్ర మార్గమంతా అడుగడుగున సీసీ కెమెరాల నిఘా కొనసాగనుంది. శోభాయాత్ర పర్యవేక్షణ కోసం జాయింట్ కంట్రోల్ రూమ్‌తో పాటు బంజారాహిల్స్‌లోని మెయిన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. భద్రతలో భాగంగా రాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిటీ ఆర్ రిజర్వ్, క్విక్ రియాక్షన్ టీం, సిటీ టాస్క్ ఫోర్స్, షీ టీమ్స్, మఫ్టీ క్రైమ్ పార్టీ పోలీసులు శోభాయాత్రను మానిటర్ చేయనున్నారు. భక్తులు శాంతియుతంగా, భక్తిభావంతో శోభాయాత్రలో పాల్గొనాలని అధికారులు కోరుతున్నారు.
శోభయాత్ర నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. సీతారాం బాగ్ కు వచ్చే వాహనాలును మల్లేపల్లి, నాంపల్లి మీదుగా దారి మళ్లించారు. బోయిగూడ కమాన్ నుంచి దారుసలాం ఆగాపురా మీదుగా, పురానా పూల్ నుంచి వాహనాలను జియాగూడ కార్వాన్ వైపు, బేగంబజార్ నుంచి వచ్చే వాహనాలను గోషామహల్ ఇతర ప్రాంతాలకు డైవర్ట్ చేశారు.
తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరు
ధర్మాన్ని ఎవరు రక్షిస్తారో వారిని ధర్మం రక్షిస్తుందని గవర్నర్ అన్నారు. శ్రీరామనవమి సందర్భంగా సీతారాం భాగ్ కు విచ్చేసిన గవర్నర్ కు రామ భక్తులు ఘన స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ మాట్లాడుత ” రాముడు ఏం చేసినా ధర్మ రక్షణకోసమే చేశాడని అన్నారు. ఇంకా శ్రీ రాముడు ధర్మ స్థాపనకు మార్గదర్శకుడు. మన భారత దేశ సంసృతి, సంప్రదాయాలకు రాముడిని ఆదర్శంగా ఉంటాడు. ప్రతి పౌరుడు భగవాన్ శ్రీరామ్ ను ఆదర్శం తీసుకోవాలి. ఆయిన మార్గంలో నడిచి దేశాభివృద్ధికి పాటు పడాలి. ప్రధాని మోదీ సబ్ కా సబ్ కా వికాస్ పేరుతో రామ మార్గంలో నడుస్తున్నారు. శ్రీ రాముడు ధర్మం కోసం రాజ్య పాలన చేశారు. భారత్ లో హిందూ రాజ్య స్థాపన శ్రీ రాముడు ఆకాంక్ష. రఘుపతి రాఘవ రాజా రామ్ పతీత్ పవన సీతారామ్.. శ్రీ రాముడు మర్యాద పురుషోత్తముడు. విష్ణు అవతారం శ్రీ రాముడు.. సీత అమ్మ వారి స్వరూపం.. నా జన్మభూమి స్వర్గం కన్నా గొప్పది అన్నారు శ్రీ రాముడు. మానవ జాతి ధర్మ కోసం ముందుకు సాగాలని కోరారు. ధర్మం వైపు మనం సాగాలానే శక్తి రాముడు మనకి ఇవ్వాలని కోరుకుందాం. అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేసి.. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ గవర్నర్ ప్రసంగం ముగించారు.
రాజా సింగ్ రాకతో సందడే సందడి
సీతారాంబాగ్ నుంచి సుల్తాన్ బజార్ హనుమాన్ వ్యాయామశాల వరకు శోభాయాత్ర సాగుతుంది. ఈ యాత్రలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సందడీ చేశారు. అయితే, ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ” ప్రతి ఏడాది లాగే ఈసారి శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్ర ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. హిందూ బంధువుల ఏకం కావడం సమాజ సేవ, దేశ సేవ కోసం యువకులను సంఘటితం చేస్తాం. మొత్తం ఐదు చోట్ల నా స్పీచ్ ఉంటుందని అన్నారు. బేగంబజార్ చత్రి వద్ద వాక్ బోర్డ్ బిల్ గురించి మాట్లాడుతానని తెలిపారు. హైదరాబాద్ లో యువకులు, రామభక్తులు ఈ శోభాయాత్రలో పాల్గొనాలని కోరారు. నా మీద పోలీసులు ఎన్ని కేసులు పెట్టిన భయపడేది లేదు. హిందూ ధర్మం కోసం పోరాడుతూనే ఉంటానని ” అన్నారు.