శేరిలింగంపల్లి: Serilingampalle Delivery Boys: గుర్తింపు కార్డు చూపించమన్నందుకు గేటెడ్ కమ్యూనిటీ వాసులకు చుక్కలు చూపించారు డెలివరీ బాయ్స్. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మై హోమ్ జ్యువెర్స్ అపార్ట్మెంట్ కమ్యూనిటీలోకి విచ్చేసిన డెలివరీ బాయ్ ని సరైన గుర్తింపు కార్డు లేదని నిలదీయడంతో వివాదం మొదలైంది. సదరు వ్యక్తి డెలివరీ పూర్తి చేసిన అనంతరం తన వాట్సాప్ గ్రూప్ ద్వారా వందలాది మంది బాయ్స్ ని పిలిపించి అపార్ట్మెంట్ వాసులపై దాడికి దిగారు.
మై హోమ్ జ్యువెర్స్ అపార్ట్మెంట్ కు ఉన్న మూడు గేట్లు మూసివేసి దాడికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి డెలివరీ బాయ్స్ అక్కడి నుంచి పంపడంతో పాటు దాడికి దిగిన ఆరుగురుపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
స్విగ్గి,జొమోటో, జాప్టో, సంస్థలు డెలివరీ బాయ్స్ కి తగిన గుర్తింపు కార్డు ఇచ్చి పంపించాలే తప్ప ఎలాంటి గుర్తింపు లేని వారిని ప్రోత్సహించ కూడదని అపార్ట్మెంట్ వైస్ ప్రెసిడెంట్ మహేష్ తెలిపారు.భవిష్యత్తులో గేటెడ్ కమ్యూనిటీ లలోనే కాకుండా రెసిడెన్షియల్ కాలనీలో కూడా ఇలాంటి ఘటన జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read: Lady Aghori: అరెరె పెద్ద సమస్య వచ్చిందే.. నీ కష్టం పగోడికి కూడా రావొద్దు అఘోరీ!