Hyderabad Roads: మహానగరంలో ఎక్కడ ఎపుడు ఏ రోడ్డు కుంగిపోతుందోనన్న భయం నగరవాసులను వెంటాడుతుంది. ఏడు నెలల క్రితం గోషామహాల్ లోని చాక్నవాడిలో ఓ రోడ్డు కుంగిపోయి కొందరు గాయాల పాలు కాగా, పలు వాహానాలు ధ్వంసమైన ఘటన తెల్సిందే. ఈ రకంగా గడిచిన ఏడేళ్లలో ఆరు ప్రాంతాల్లో రోడ్లు కుంగిపోయిన ఘటనలు సంభవించాయి. తాజాగా బంజారాహిల్స్ (Banjarahills) లోని రోడ్ నెంబర్ -1 లో మరో రోడ్డు కూరుకుపోయింది. హెవీవెహికల్ అయిన వాటర్ ట్యాంక్(Water tanker) నాలాపై నిర్మించిన స్లాబ్ పై నుంచి ప్రయాణించగా, ఒక్కసారి కూరుకుపోయింది. ఏడాది క్రతం హిమాయత్(Himayath Nagar) నగర్ వీధి నెం. 5లోని మరో రోడ్డు కుంగిపొయింది. 2018 నుంచి నేటి వరకు ఇలాంటి తరహాలోనే రోడ్డు కుంగిన ఘటనలు ఆరు వరకు చోటుచేసుకున్నాయి. గతంలో ఇదే తరహాలో పంజాగుట్ట(Panjagutta) మెయిన్ రోడ్డులో, నెక్లెస్ రోడ్డులో, అలాగ్ ఎన్టీఆర్ గార్డెన్స్ ముందు, మినిష్టర్ రోడ్డ వద్ద రోడ్డు కుంగిపోయిన ఘటనలు జరిగాయి. కేవలం ఘటనలు జరిగినపుడు మాత్రమే సంబంధించి ప్రభుత్వ శాఖలు హడావుడి చేసి, ఆ తర్వాత అంత మామూలే అన్నట్టుగా వ్యవహారిస్తున్నాయి.
అప్పుడే హడావుడి చేస్తున్న అధికారులు
40 ఏళ్ల క్రితం కూడా అహ్మద్ నగర్ డివిజన్ లోని నెహ్రూనగర్ అనే బస్తీలోని ఇళ్లు నాలాలోకి కూరుకుపోయిన ఘటన జరిగింది. ఈ ఘటనలో ఓ చిన్నారి ప్రాణాలను కొల్పోయింది. ఆ ఇళ్లు కుంగిపోతే గానీ, ఆ ఇంటి కింద పాతకాలం సెప్టిక్ ట్యాంక్ ఉన్న విషయం బయట పడలేదు. ఈ ఘటన జరిగిన తర్వాత ఇలాంటి పాతకాలపు నాలాలను గుర్తించి వాటిని పూడ్చేయటం గానీ, పునరుద్దరించటం గానీ చేస్తామని అధికారులు ప్రకటించినా, వారి హడావుడి కేవలం కొద్ది రోజులకే పరిమితమైంది. గతంలో నెక్లెస్ రోడ్డు(Necklace Road)లో కూడా రోడ్డు కుంగిపోయి పాతకాలం నాలా బయటపడిన సంగతి తెల్సిందే. ఆ తర్వాత హిమాయత్ నగర్ వీది నెం. 5లో మరో రోడ్డు కుంగిపోయింది. ఇలాంటి ఘటనలు జరిగినపుడల్లా పాతకాలపు సెప్టిక్ ట్యాంక్ లు, నాలాలు బయటపడుతున్నాయి. ఎక్కడ ఏ నాలా ఉందో? సెట్టిక్ ట్యాంక్ ఉందో? తెలియని పరిస్థితి నెలకొంది. హిమాయత్ నగర్ వీది నెం. 5 రోడ్డులో మట్టి లోడు భారీ బరువుతో వెళ్తున్న టిప్పర్ ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయి, టిప్పర్ గొయ్యిలోకి కూరుకుపోయింది.
ఎక్కువ బరువుతో వచ్చిన వాటర్ ట్యాంకర్
అసలే మెయిన్ రోడ్డు, అందులో బిజీ రోడ్డు కావటంతో ట్రాఫిక్(Traffic) సమస్య తలెత్తింది. ఆ తర్వాత జీహెచ్ఎంసీ(GHMC), పోలీసు అధికారులు కలిసి క్రేన్ తో టిప్పర్ ను బయటకు లాగి, అక్కడ నాలా ఉన్నట్లు గుర్తించారు. ఇలాంటి ఘటనే మంగళవారం బంజారాహిల్స్ లో జరిగింది. ఎక్కువ బరువుతో వచ్చిన వాటర్ ట్యాంక్ రోడ్డు కుంగిపోవటంతో గొయ్రిలో చిక్కకుపోవటంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ(GHMC), పోలీసు అధికారులు ట్యాంకర్ ను బయటకు తీశారు. కుంగిపోయిన రోడ్డు మీదుగా తరుచుగా స్కూల్ బస్(School Bus) వెళ్లేదని, బస్ వెళ్లేటపుడు కుంగిపోయి ఉంటే ఎలాంటి నష్టం జరిగేదోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. స్కూల్ బస్ కన్నా ట్యాంకర్ ఎక్కువ బరువుతో రావటంతో నాలా పై కప్పు కూరుకుపోయి, గొయ్యిలో ట్యాంకర్ చిక్కుకున్నట్లు సమాచారం.
Also Read; Child Marriage: రంగారెడ్డి జిల్లాలో దారుణం.. 13 ఏళ్ల బాలికకు 40 ఏళ్ల వ్యక్తితో వివాహం!
నాలాపై రోడ్డు వేశారా?
హిమాయత్ నగర్ లో రోడ్డు కూరుకుపోయి బయటపడ్డ గొయ్యి నాలానా? లేక పాతకాలపు సెప్టిక్ ట్యాంకా? అన్నది మిస్టరీగా మారింది. ఇదే తరహాలో మంగళవారం కుంగిపోయిన రోడ్డు కింద పాతకాలం నాలా బయట పడింది. ఇప్పటి వరకు నాలాకిరువైపులా, నాలాలపైన కేవలం పేద తరగతి ప్రజలు మాత్రమే ఇళ్లను నిర్మించుకున్నారు. కానీ తాజాగా బంజారాహిల్స్(Banjarahills) వంటి పాష్ ఏరియాలో జరిగిన ఘటనను గమనిస్తే నాలాకు పై కప్పు నిర్మించి, గతంలో రోడ్డు ఫార్మేషన్ చేశారన్న వాదన విన్పిస్తుంది. ఈ రకంగా నగరంలో ఎన్నో పాతకాలపు నాలాలున్నాయనేది అధికారులు అంచన. భారీ వర్షాలు కురిసినపుడు ఎక్కడా కూడా నీరు నిలిచి, ముంపునకు గురికాకుండా ఉండేందుకు పూర్వీకులు ఈ నాలాలను ఏర్పాటు చేసి ఉండవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆగని నాలాల ఆక్రమణ
మహానగరంలో తరుచూ రోడ్డు కుంగిపోతున్న ఘటనల్లో నాలాలను ఆక్రమించి, నాలాపైనే బహుళ అంతస్తు భవనాలు నిర్మించారన్న, నేటికీ నిర్మిస్తున్నారన్న విషయం తేలిపోయినా, కనీసం ఇప్పటికైనా ఇలాంటి నిర్మాణాలను అడ్డుకోవటం లేదు. నాలాలపైనే యదేచ్చగా ఏకంగా నాలుగైదు అంతస్తుల భవనాలను నిర్మించినట్లు గతంలో చాక్నావడలో రోడ్డు కుంగిన ఘటనతో తేలిపోయింది. మహానగరంలో ఇంకా ఎన్ని ప్రాంతాల్లో ఇలాంటి నాలాలు, సెప్టిక్ ట్యాంక్(Septic tank) లున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. భారీ నాలాలపై కప్పులపై నిర్మించిన బహుళ అంతస్తు భవనాలు కుంగిపోతే హిమాయత్ నగర్, గోషామహల్ చాక్నావాడి ఘటన మున్ముందు జరిగే ఘటనలతో పోల్చితే ఎంతో చిన్నదనే చెప్పవచ్చు. గోషామహల్ లో కేవలం నాలా పై కప్పు కుంగిపోయింది. కానీ పాతబస్తీతో పాటు న్యూసిటీలోనూ ఉన్న పాతకాలపు నాలాలపై బహుళ అంతస్తు భవనాలెన్నో ఉన్నాయని, ఎప్పటికైనా అవి నాలాల్లో కూరుకుపోయే ప్రమాదం పొంచి ఉందన్న వాదనలున్నాయి. ఈ ప్రమాదాన్నితప్పించేందుకు జీహెచ్ఎంసీ(GHMC) అధికారులు ఇప్పటికైనా ఓ సర్వే నిర్వహించి, నాలాలు, సెప్టిక్ ట్యాంక్ లపై నిర్మించిన భవనాలను గుర్తించాల్సిన అవసమెంతైనా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: Beer shampoo: బీర్ షాంపూల వల్ల జుట్టుకు ఎన్ని ప్రయోజనాలో తెలుసా?