RV Karnan: ప్రజావాణిలో వచ్చిన ఆర్జీలను వెంటనే జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి నగర నలుమూలల నుండి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, సామాజిక సమస్యల పై విన్నపాలను కమిషనర్ క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం కోసం సంబంధిత విభాగాల అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు వ్యక్తిగత, సామాజిక సమస్యలను వ్యక్తం చేసిన నేపథ్యంలో అధికారులు వాటిని బాధ్యత తో పరిష్కరించాలని తెలిపారు. ఆర్థిక పరమైన అర్జీల పై క్షేత్ర స్థాయిలో పరిశీలించి తగు నిర్ణయం తీసుకున్నది, లేనిది సంబంధిత అర్జీదారునికి లిఖిత పూర్వకంగా తెలియజేయాలని ఆదేశించారు.
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 66 విన్నపాలు రాగా, అందులో టౌన్ ప్లానింగ్ విభాగానికి 33, ఇంజనీరింగ్ 6, ట్యాక్స్ సెక్షన్ 5, ఎలక్ట్రిక్, ల్యాండ్ అక్విజిషన్, ఫైనాన్స్, అడ్మినిస్ట్రేషన్, శానిటేషన్, హౌసింగ్, విజిలెన్స్ విభాగాలకు రెండు చొప్పున, హెల్త్, ఎస్టేట్, లేక్స్, యూబీడీ విభాగాలకు ఒకటి చొప్పున ఫిర్యాదులు అందగా, ఫోన్ ఇన్ ద్వారా 4 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో మొత్తం 113 అర్జీలు వచ్చాయని, అందులో కూకట్ పల్లి జోన్ లో 40, శేరిలింగంపల్లి జోన్ లో 14, ఎల్బీనగర్ జోన్ లో 9, సికింద్రాబాద్ జోన్ లో 17, చార్మినార్ జోన్ లో 3, ఖైరతాబాద్ జోన్ 30 ఆర్జీలు అందినట్లు వెల్లడించారు.
కలెక్టరేట్ లో 101 ఆర్జీల స్వీకరణ
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రజల నుండి 101 దరఖాస్తులను అయన స్వీకరించారు.ఆ ఆర్జీలను శాఖాధికారులు సత్వరమే పరిశీలన చేసి పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో హౌసింగ్ 46, పెన్షన్ 16, ఇతర శాఖలకు సంబంధించినవి 39 దరఖాస్తులు అందాయని అయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు కదిరివన్ పలని, జి. ముకుంద రెడ్డి, డీఆర్ఓ ఈ. వెంకట చారి, జిల్లా అధికారులు జి. ఆశన్నా, సురేందర్, రమేష్,సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
Also Read: MP Bandi Sanjay: అందాల పోటీలపై ఉన్న శ్రద్ద పుష్కరాలపై లేదా?.. ప్రభుత్వంపై బండిసంజయ్ ఫైర్!