Vishwak Sen (imagecredit: twitter)
హైదరాబాద్

Vishwak Sen: హీరో సోదరి ఇంట్లో చోరీ.. అరెస్ట్ చేసిన పోలీసులు..

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Vishwak Sen:  టాలీవుడ్​ హీరో విశ్వక్​ సేన్​ సోదరి ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డిన  వ్యక్తిని ఫిలింనగర్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుని నుంచి రెండు లక్షల రూపాయల విలువ చేసే వజ్రపు ఉంగరాలను  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జూబ్లీహిల్స్​ ప్రాంతంలో నివాసముంటున్న విశ్వక్​ సేన్ సోదరి ఇంటి నుంచి ఇటీవల దొంగ రెండు డైమండ్​ ఉంగరాలను తస్కరించి ఉడాయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆమె తండ్రి ఫిర్యాదు చేయగా కేసులు నమోదు చేసిన పోలీసులు ఈ నేరానికి పాల్పడ్డ అఖిల్​ అనే వ్యక్తిని అరెస్ట్​ చేశారు.

డైమండ్​ హిల్స్​ లో భారీ చోరీ…

కాగా, ఫిలింనగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని  డైమండ్​ హిల్స్​ లో సోమవారం రాత్రి భారీ చోరీ జరిగింది. డైమండ్​ హిల్స్​ లో నివాసముంటున్నటున్న ముజాహిద్‌​ రంజాన్​ మాసం కావటంతో తన ఇంటికి తాళాలు వేసి ప్రార్థనలు చేయటానికి వెళ్లాడు. తిరిగి వచ్చి చూసేసరికి తాళాలు పగులగొట్టి కనిపించాయి. దీంతో తనిఖీ చేయగా బీరువాలో దాచి పెట్టిన 34 తులాల బంగారు నగలు, 4.5లక్షల నగదు, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ముజాహిద్‌​ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసునమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: DK Aruna: డికె అరుణ ఇంట్లో భద్రత పెంపు.. ఆదేశాలిచ్చిన సీఎం 

Just In

01

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?