Vijaya Rahatkar: బాధిత మహిళలకు జాతీయ మహిళా కమిషన్ అండగా నిలుస్తుందని జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ విజయ రహత్కర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ టూరిజం ప్లాజా సమగం హాల్ లో ఏర్పాటు చేసిన మహిళా జన్ సున్వాయి( బహిరంగ విచారణ) లో ఆమే పాల్గొని కేసులు పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హైదరాబాద్ లో కమిషన్ మొదటగా ఏర్పాటు చేసి మహిళా బాధితుల నుండి 60 వరకు దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయని, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నదే ముఖ్య ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు. కమిషన్ దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి బాధిత మహిళల నుండి వేల సంఖ్యలో దరఖాస్తులు అందుతున్నాయని తెలిపారు. కమిషన్ ముఖ్య ఉద్దేశం మహిళలు పడుతున్న బాధలు, కష్టాలు బాధితుల సమస్యల సత్వరం పరిష్కరించటం కోసం కమిషన్ నేరుగా బాధితుల వద్దకు రావటం జరుగుతుందని వెల్లడించారు.
Also read: Farmer ID: అన్నదాతకు అండగా ఫార్మర్ రిజిస్ట్రేషన్.. 11 అంకెలతో గుర్తింపు కార్డులు!
కమిషన్ కు మహిళల గృహహింస కేసులు, సైబర్ నేరాలు,ఆన్ లైన్ హారాష్మెంట్ కేసులు, చైల్డ్ కస్టడీ కేసులు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు మరికొన్ని ఇతర కేసులు కూడా కమిషన్ దృష్టికి వచ్చాయని తెలిపారు. కమిషన్ పరిధిలో ఉన్న హైదరాబాద్ పరిధి లో 2022 నుండి 2024 ఉన్న కేసులలో సత్వరమే 30 కేసులను పరిష్కరించి బాధితులకు న్యాయం చేశామని వివరించారు.
జిల్లాలోని అన్ని శాఖల అధికారులు ఎక్కడ కూడా అశ్రద్ధ, నిర్లక్ష్యం చూపకుండా మహిళా కేసులను వేగవంతంగా పరిష్కరించాలని ఆమె అధికారులకు ఆదేశించారు. అన్ని రాష్ట్రాలలో నెలలో నెలకు నాలుగు సార్లు కమిషన్ బాధిత మహిళల వద్దకు వెళ్లి సత్వర న్యాయం చేసి అండగా నిలుస్తున్నామని తెలిపారు. పెండింగ్ కేసుల అంశాలను నివేదిక రూపంలో సత్వరమే అందించాలని పోలీస్ అధికారులను ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ శారద నేరెళ్ల, తదితరులు పాల్గొన్నారు.