Miss World Contestants: ప్రపంచ సుందరి పోటీల్లో భాగంగా శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న స్పోర్ట్స్ ఫైనల్స్ కార్యక్రమం నిర్వహించారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు పాల్గొన్నారు. క్రీడాకారులు తాంగ్ -త మార్షల్ ఆర్ట్స్ , రోలర్ స్కేటింగ్ ప్రదర్శన చేశారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ యోగాసనాలు చేశారు. చూపరులను ఆకట్టుకున్నారు.
మిస్ వరల్డ్ ఫౌండర్ జూలియా మోర్లీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ఒకప్పుడు క్రీడల్లో మహిళల ప్రాతినిధ్యం నామమాత్రంగానే ఉండేది కానీ ఇప్పుడు ప్రాతినిధ్యం స్థాయి నుంచి ఎదిగి పతకాలు అందించే స్థాయికి ఎదిగారన్నారు.
పురుషులతో సమానంగా క్రీడల్లో పోటీ పడుతూ, ప్రజాదరణ పొందుతున్నారని తెలిపారు. శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడు మానసిక స్థైర్యం పెరుగుతుందని, అది మనం ఏదైనా సాధించేలా చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించి, నూతన క్రీడా విధానంపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలిపారు.
Also read: Ponnam Prabhakar: చెత్త కనబడినా.. లైట్లు వెలగకపోయినా చర్యలు తప్పవు.. మంత్రి హెచ్చరిక!
గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని స్థాపిస్తున్నారని చెప్పారు. ఈ చొరవ మహిళల సాధికారతకు దారితీస్తుందని, పిల్లలు క్రీడలను వృత్తిగా ఎంచుకునేలా ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ వేదికకు పరిచయం చేయడం, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా చేయడం, అద్భుతమైన పర్యాటక ప్రదేశాలను ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో మిస్ వరల్డ్ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొత్త ప్రదేశాలను సందర్శించడం కేవలం విలాసం, విశ్రాంతి సాధనం కాదని, మరో సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోవడం, కొత్త వంటకాలను రుచి చూడటం, ఈ జ్ఞాపకాలను పదిలంగా గుర్తుంచుకోవడానికి పర్యాటకం దోహదపడుతుందని చెప్పారు.
పర్యాటకం అనేది ప్రజల మధ్య బంధాలను నిర్మించే వంతెన లాంటిదని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, ఎంపీ, బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనీబాల, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ మల్లారెడ్డి, డైరెక్టర్ ఆఫ్ టూరిజం హనుమంత్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Also read: Health Cards To Orphans: దేశంలోనే ఫస్ట్ టైమ్.. అనాథలకు ఆరోగ్యశ్రీ కార్డులు!
ఫిలీం సిటీని సందర్శించిన తారలు
ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిమ్స్ స్టూడియో అయిన రామోజీ ఫిలిం సిటీ నీ చూసి మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఆశ్చర్యపోయారు. ఫిలిం సిటీ అద్భుతంగా ఉందని కితాబు ఇచ్చారు. ఫిలిం సిటీలో హవామహల్, ఏంజిల్ ఫౌంటెన్, నర్తకి గార్డెన్, పామ్ గార్డెన్ లను సందర్శించారు.