Wine Shops Closed: ఉప ఎన్నిక నేపథ్యంలో హైదరాబాద్(Hyderabad), సైబరాబాద్(Cyberabad) కమిషనరేట్ల పరిధుల్లోకి వచ్చే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రాంతాల్లో మూడు రోజులపాటు వైన్ షాపులు(Wine shops) మూత పడనున్నాయి. ఈ మేరకు గురువారం రోజున కమిషనర్లు ఉత్తర్వులు జారీ చేశారు. మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికల ప్రచారాన్ని జరుపుతున్నాయి. మరోవైపు శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా పోలీస్ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఆయా కమిషనరేట్ల పరిధుల్లోకి వచ్చే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రాంతాల్లో ఈ నెల 9 నుంచి 11వ తేదీ సాయంత్రం వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read: Bus Seat Dispute: ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడి.. బస్సులో అసలేం జరిగిందో తెలిస్తే షాకే!
ఈసీ కీలక నిర్నయం..
దేశంలో ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా పోలింగ్ శాతం పడిపోవటాన్ని భారత ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది. ప్రజాప్రతినిధుల ఎన్నికలో ఓటర్ల భాగస్వామ్యం పెంచేందుకు ఏ ఎన్నిక జరిగినా, తప్పకుండా ఓటింగ్ శాతం పెంచేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం దేశ వ్యాప్తంగా వివిధ కారణాలతో ఖాళీ అయిన మరో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు బీహార్ రాష్ట్రానికి జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగానే ఈ నెల 11న జరగనున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో భాగంగా పోలింగ్ సమయాన్ని మరో గంట పెంచింది.
Also Read: Chikiri song record: బన్నీ రికార్డును బ్రేక్ చేసిన రామ్ చరణ్.. ఇండియాలో ఇదే ఫస్ట్ సాంగ్
