Balapur Laddu Auction 2025: హైదరాబాద్ లో బాలాపూర్ గణేశ్ కు ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. ఈ గణనాథుడి లడ్డు ఏటా వేలంలో రికార్డు స్థాయి ధరను సొంతం చేసుకొని వార్తల్లో నిలుస్తుంటుంది. ఈసారి కూడా బాలాపూర్ లడ్డును వేలం నిర్వహించగా.. గత రికార్డులను చెరిపివేసింది. ఏకంగా ఆల్ టైమ్ అత్యధిక ధరను సొంతం చేసుకుంది. బాలాపూర్ గణేశ్ లడ్డును కర్మాన్ ఘాట్ కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ ఎన్నడూ లేనంత ధరను వెచ్చించి సొంతం చేసుకున్నారు.
లడ్డు ఎంత పలికిందంటే?
బాలాపూర్ లడ్డు ఈసారి వేలంలో రూ. 35 లక్షల ధర పలికింది. కర్మాన్ ఘాట్ కు చెందిన లింగాల దశరథ్ దీనిని సొంతం చేసుకున్నారు. గతేడాదితో (రూ.30.01 లక్షలు) పోలిస్తే రూ.4.99 లక్షలు అధికంగా చెల్లించి లడ్డును సొంతం చేసుకోవడం విశేషం. అంతకుముందు బాలాపూర్ గణపతిని మండపం నుంచి బయటకు తీసుకొచ్చిన నిర్వాహకులు ఘనంగా ఊరేగించారు. బాలాపూర్ లోని బొడ్రాయి వద్దకు రాగానే గణనాథుడ్ని నిలిపి అక్కడ వేలం పాట నిర్వహించారు. ఈ క్రమంలో స్థానికులు, స్థానికేతుల మధ్య తీవ్ర పోటీ జరగ్గా.. చివరికీ లింగాల దశరథ్ ఎక్కువ మెుత్తంలో పాడుకొని లడ్డును కైవసం చేసుకున్నారు.
Also Read: Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు
శోభాయాత్ర ప్రారంభం..
బాలాపూర్ లడ్డు వేలం ముగియడయంతో తిరిగి శోభయాత్ర మెుదలైంది. ముందుగానే నిర్ణయించిన రూట్ మ్యాప్ ప్రకారం బాలాపూర్ గణేశ్ ముందుకు సాగుతున్నారు. గుర్రం చెరువు కట్ట మైసమ్మ ఆలయం వద్ద, కేశవగిరి, చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్, ఎంబీఎన్‌ఆర్ ఎక్స్ రోడ్స్, ఫలక్‌నుమా రైల్వే ఓవర్ బ్రిడ్జి, అలియాబాద్, నాగుల్‌చింత, చార్మినార్, మదీనా బిల్డింగ్, అఫ్జల్‌గంజ్, సిద్దిఅంబర్ బజార్, ఎంజే మార్కెట్, అబిడ్స్ ఎక్స్ రోడ్, బషీర్‌బాగ్, లిబర్టీ జంక్షన్ మీదుగా బాలపూర్ గణేశ్ హుస్సేన్ సాగర్ కు చేరుకోనున్నాడు. సాయంత్రం లోపు నిమజ్జనం ప్రక్రియ పూర్తి కానుంది.
Also Read: Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు
రూ.2.32 కోట్లు పలికిన లడ్డు
ఇదిలా ఉంటే హైదరాబాద్ బండ్లగూడలో గణేశ్ లడ్డు కనీవినీ ఎరుగని ధరను సొంతం చేసుకుంది. రాజేంద్ర నగర్ పరిధిలోని కీర్తి రిచ్మండ్ విల్లాస్‌లో ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా గణనాథుడ్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి లడ్డు వేలం పాట నిర్వహించారు. ఈ క్రమంలో లడ్డు ఏకంగా రూ. 2.32 కోట్లు (రూ. 2,31,95,000) పలికింది. గతేడాదితో (రూ.1.87 కోట్ల) పోలిస్తే ఇది రూ.45 లక్షలు అధికం. కాగా, రిచ్మండ్ విల్లాస్ లో మెుత్తం 80కి పైగా కుటుంబాలు జీవిస్తున్నాయి.