Gang Arrested: వ్యాపార…వ్యక్తిగత కక్షలతో రౌడీషీటర్ హత్యకు కుట్ర చేసిన గ్యాంగును సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ అధికారులు లంగర్ హౌస్ పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు నాటు తుపాకులు, అయిదు బుల్లెట్లు, క్వాలిస్ కారుతోపాటు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాస రావు, సౌత్ వెస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ మహ్మద్ ఇక్భాల్ సిద్దిఖీ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
నార్సింగి పోలీస్ స్టేషన్ లో రౌడీషీటర్ గా నమోదై ఉన్న అహమద్ అలీఖాన్, ఆమెర్ లు అన్నదమ్ములు. కాగా, లంగర్ హౌస్ పెన్షన్ పురా నివాసి సయ్యద్ అఫ్రోజ్ (37) ఈ ఇద్దరితో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటం మొదలు పెట్టాడు.
Also Read: Hydra demolition: ఏపీని తాకిన హైడ్రా ప్రకంపనలు.. టీడీపీ ఎమ్మెల్యే భూముల్లో కూల్చివేతలు..
వివాదాల్లో ఉన్న భూములు, ఆస్తులకు సంబంధించిన వివరాలను సేకరించి వాటిని సెటిల్ మెంట్లు చేయటం ఆరంభించాడు. ఈ క్రమంలో అహమద్ అలీఖాన్, ఆమెర్ లు సెటిల్ మెంట్ల ద్వారా వచ్చిన డబ్బులో సయ్యద్ అఫ్రోజ్ కు ఇస్తామన్న వాటా ఇవ్వలేదు. దాంతోపాటు మరో ఇద్దరు భాగస్వాములు మహ్మద్ షా ఒవైస్, సయ్యద్ ఫిర్దౌజ్ లకు కూడా ఇస్తామన్న డబ్బు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. దాంతో సయ్యద్ అఫ్రోజ్, మహ్మద్ షా ఒవైస్, సయ్యద్ ఫిర్దౌజ్ లు అహమద్ అలీఖాన్, ఆమెర్ లపై కక్ష పెంచుకున్నారు.
ఎలాగైనా సరే పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో వీరికి సయ్యద్ ఇంతియాజ్ అలీ జతయ్యాడు. అహమద్ అలీఖాన్, ఆమెర్ లు సహచరులతో కలిసి తన సోదరుడు సయ్యద్ ఫయాజుద్దీన్ ను హత్య చేశారని చెప్పిన ఇంతియాజ్ అలీ తాను కూడా పగ తీర్చుకోవటానికి అవకాశం కోసం చూస్తున్నట్టు చెప్పాడు. వీరికి మహ్మద్ షా ఒవైస్ మేనల్లుడు మహ్మద్ అర్భాజ్ ఖాన్, మహ్మద్ జమీల్ లు కూడా తోడయ్యారు.
Also RTead: Samantha: స్పీడ్ పెంచిన సామ్.. పక్కా ప్లాన్ తో రెడీ అయిన సమంత
ఆ తరువాత అంతా కలిసి కలిసి అహమద్ అలీఖాన్, ఆమెర్ లను హత్య చేయటానికి కుట్ర చేశారు. దీంట్లో భాగంగా సయ్యద్ అఫ్రోజ్ తనకు పరిచయం ఉన్న అత్తాపూర్ పోలీస్ స్టేషన్ రౌడీషీటర్ జాబేర్ నుంచి రెండు నాటు తుపాకులు, అయిదు బుల్లెట్లు కొన్నాడు. అందరూ కలిసి అహమద్ అలీఖాన్, ఆమెర్ లను చంపటానికి రెక్కీ ప్రారంభించారు. కుట్రను అమలు చేయటానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.
ఈ మేరకు పక్కగా సమాచారాన్ని సేకరించిన సీఐలు రఘుకుమార్, బాలస్వామి, ఎస్సైలు రాఘవేంద్ర స్వామి, అజిత్ సింగ్, శరత్ చంద్రతోపాటు సిబ్బందితో కలిసి దాడి చేసి సయ్యద్ అఫ్రోజ్, మహ్మద్ షా ఒవైస్, మహ్మద్ అర్భాజ్ ఖాన్, సయ్యద్ ఫిర్దౌజ్, సయ్యద్ ఇంతియాజ్ అలీలను అరెస్ట్ చేసి వారి నుంచి నాటు తుపాకులు, బుల్లెట్లు, కారు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న జాబేర్, మహ్మద్ జమీల్ ల కోసం గాలిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు