Kushaiguda Murder : హైదరాబాద్ లోని కుషాయి గూడలో నడిరోడ్డుపై తండ్రిని ఓ కన్న కొడుకు చంపిన ఘటన సంచలనం రేపుతోంది. శనివారం మధ్యాహ్నం నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కుషాయిగూడకు చెందిన మొగిలిని (Mogili) అతని కొడుకు సాయి వేటాడి కత్తితో పొడిచి మరీ చంపేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సంచనలం రేపాయి. అయితే సాయి తన తండ్రిని చంపడానికి అసలు కారణం వేరే ఉందని చెబుతున్నాడు. తన తండ్రి బెట్టింగ్, పేకాట, వ్యసనాలకు బానిస అయి ఇంట్లో నిత్యం గొడవలు చేస్తున్నాడని సాయి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
తాను ప్రేమ వివాహం చేసుకుంటే.. అది కూడా తన తండ్రి వల్లే చెడిపోయిందని.. చివరకు తన చెల్లెలికి కూడా తన తండ్రి వల్లే పెళ్లి కావట్లేదని సాయి వాపోతున్నాడు. మద్యానికి బానిస అయి నిత్యం ఇంట్లో తల్లి, చెల్లిని వేధిస్తున్నాడని.. అది చూసి తట్టుకోలేకనే ఇలా చేసినట్టు సాయి చెబుతున్నాడు.