JNTU Hyderabad: సహోద్యోగినిపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడిన జేఎన్టీయూ ప్రొఫెసర్‌ను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రతిష్టాత్మకమైన వర్సిటీలో తీవ్ర కలకలం సృష్టించిన ఈ సంఘటన వివరాలను పోలీసులు వెల్లడించారు. కొంతకాలం క్రితం ఓ మహిళ గెస్ట్ ఫ్యాకల్టీగా జేఎన్టీయూ వర్సిటీలో ఉద్యోగంలో చేరింది. ఇదే వర్సిటీలో పనిచేస్తున్న ఓ ప్రొఫెసర్, ఆమె సామాజికవర్గం ఒక్కటేనని చెప్పి మొదట ఆమెకు సన్నిహితంగా మారాడు.
Also Read: Hyderabad Crime: పవిత్ర హత్య కేసులో ట్విస్ట్.. మద్యం మత్తులో ఘాతుకం.. కేసును ఛేదించిన పోలీసులు!
ఉద్యోగం నుంచి తీసి వేయిస్తా
ఆ తరువాత, ఆ ప్రొఫెసర్ తాను చెప్పినట్టుగా వినకపోతే ఉద్యోగం నుంచి తీసి వేయిస్తానని బెదిరించి ఆ మహిళా గెస్ట్ ఫ్యాకల్టీపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అర్ధరాత్రి వరకు క్యాంపస్‌లోనే ఆమెను ఉంచడం కారణంగా ఆమె వైవాహిక జీవితంలో కూడా స్పర్థలు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రొఫెసర్ వేధింపులు ఎక్కువ అవుతుండటంతో భరించలేకపోయిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు సదరు కీచక ప్రొఫెసర్‌ను అరెస్ట్ చేసి జైలుకు రిమాండ్‌కు తరలించారు.
Also Read: CM Revanth Reddy: బంద్ పేరుతో బెదిరింపులు.. ప్రైవేటు కాలేజీలకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

