Sri Chaitanya IT Rides: శ్రీ చైతన్య విద్యాసంస్థలకు ఆదాయ పన్ను శాఖ అధికారులు భారీ షాకిచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆ విద్యాసంస్థకు చెందిన కాలేజీల్లో అకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ మాదాపూర్ లోని శ్రీ చైతన్య కాలేజీ హెడ్ క్వార్టర్స్ లోనూ ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. అక్కడ పెద్ద మెుత్తంలో అక్రమ లావాదేవీలు గుర్తించినట్లు సమాచారం.
తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైల్లో శ్రీ చైతన్యకు విద్యాసంస్థలకు కాలేజీలు ఉన్నాయి. మాదాపూర్ లోని శ్రీచైతన్య కాలేజీ హెడ్ క్వార్టర్స్ కేంద్రంగా అవన్నీ పనిచేస్తున్నాయి. అయితే స్టూడెంట్స్ నుంచి నగదు రూపంలో డబ్బులు తీసుకొని ట్యాక్స్ చెల్లించకుండా వాటిని ఎగవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ సాఫ్ట్ వేర్ నే తయారు చేసుకున్నట్లు తెలుస్తోంది. అక్రమ లావాదేవీలకు ఒక సాఫ్ట్ వేర్.. ట్యాక్స్ చెల్లింపులకు మరో సాఫ్ట్ వేర్ ను శ్రీచైతన్య ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. దీంతో హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఉన్న శ్రీచైతన్య కాలేజీలో ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ ఐటీ రైడ్ లకు సంబంధించి మరింత సమాచారం రావాల్సి ఉంది.
Also Read: TGPSC Group 1 Results: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫలితాలు వచ్చేశాయ్