Hyderabad Rains (imagecredit:swetcha)
హైదరాబాద్

Hyderabad Rains: బీకేర్ ఫుల్ ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

Hyderabad Rains: గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ద్రోణీ కారణంగా సిటీలో మరో మూడు రోజుల పాటు చిరు జల్లులు మొదలుకుని ఓ మోస్తారు వర్షం కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ(IMD) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సిటీలో సాయంత్రం నుంచి తెల్లువారుఝము వరకు కురిసిన వర్షం కారణంగా బుధవారం ఉదయం నిత్యం రద్దీగా ఉండే పలు ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ జామ్(Traffic Jam) ఏర్పడింది. సాయంత్రం నుంచి అర్థరాత్రి పన్నెండు గంటల వరకు గరిష్టంగా జూబ్లీహిల్స్ లో 4 సెం.మీ.ల వర్షపాతం నమోదు కాగా, మెహిదీపట్నం, లంగర్ హౌజ్ ప్రాంతాల్లో కనిష్టంగా రెండు సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రాత్రి పన్నెండు గంటల నుంచి సికిందరాబాద్ మారెడ్ పల్లిలో 0.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.

ప్రతి రోజుల లక్షలాది వాహానాలు రాకపోకలు సాగించే లక్డీకాపూల్ మెయిన్ రోడ్డులో ఉదయం ఎనిమిది గంటల నుంచే ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఖైరతాబాద్(Khairatabad) జంక్షన్ నుంచి సోమాజీగూడ, పంజాగుట్ట, అమీర్ పేట వెళ్లాల్సిన వాహానాలు కిలోమీటర్ల పొడువున క్యూ కట్టాయి. ఉదయం ఆఫీసుల వేళలో వాహనదారులు ఇబ్బందుల పాలయ్యారు. పలు చోట్ల బుధవారం ఉదయం కూడా వర్షంపు నీరు రోడ్లపై నిలిచి ఉండటంతో వాహానాలు ఎక్కడికక్కడే స్ట్రక్ అయ్యాయి. ఫలితంగా వృత్తి, విద్యా, ఉద్యోగాల కోసం వెళ్లాల్సిన వాహనదారులు తమ గమ్యస్తానాల్ని చేరుకునేందుకు సుమారు గంట సేపు ఆలస్యమైంది. ఆఫీసు టైమ్‌లో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారినా, ఎక్కడా కూడా పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే విధులు నిర్వర్తించాల్సిన దాఖలాల్లేవు.

మూడు గంటలకోసారి
ఈ సారి వానాకాలం కష్టాల నివారణ బాధ్యతలను భుజానే వేసుకున్న హైడ్రా(Hydraa) ఇప్పటికే 4800 మంది సిబ్బందితో రెండు రకాల మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ లను తయారు చేసింది. ఫస్ట్ టైమ్ హైడ్రా వానాకాలం కష్టాల నివారణ బాధ్యతలను నిర్వహిస్తున్నందున, గతంలో కన్నా కాస్త పరిస్థితి మెరుగుపడిందని నగర వాసులు భావించేలా హైడ్రా ఎప్పటికపుడు రెయిన్ అలర్ట్(Rain Alert)పై ఫోకస్ చేసింది. ప్రతి మూడు గంటలకోసారి వాతావరణ శాఖను సంప్రదిస్తూ రెయిన్ అలర్ట్ వివరాలు తెప్పించుకుని, ఫీల్డు లెవల్ లో ఉన్న మాన్సూన్ టీమ్ లను అప్రమత్తం చేస్తుంది.

Also Read: MLA Veerlapalli Shankar: పేద రైతుల జోలికొస్తే ఊరుకోం.. ఎమ్మెల్యే ఫైర్

ఎక్కడెక్కడ కుండపోత, చిరు జల్లులు, భారీ వర్షం వివరాలను తెల్సుకుని టీమ్ లకు సమాచారం అందిస్తుంది. ముఖ్యంగా మహానగరంలో ప్రస్తుతమున్న నిజాం కాలేజీ నాటి వరద నీటి కాలువలు కేవలం రెండు సెంటీమీటర్ల వర్షపాతానికి మాత్రమే తట్టుకోనున్నందున తక్కువ సమయంలో ఎక్కువ మోతాదులో వర్షం కురవనుందన్న విషయాన్ని ముందుగానే కనుగోని టీమ్ లకు డ్యూటీలు వేస్తుంది. మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ముసురుగా, చిరు జల్లుల నుంచి ఓ మోస్తారు వరకు వర్షం కురిసే అవకాశముందన్న సమాచారాన్ని సేకరించిన హైడ్రా మంగళవారం రాత్రి నుంచి రౌంది క్లాక్ విధులు నిర్వర్తించాలని ఆదేశాలు జారీ చేసింది.

వర్షాకాలంలో పనులేంటీ?
సాధారణంగా జీహెచ్ఎంసీ(GHMC)సీసీ, బీటీ రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణ పనులను వర్షాకాలానికి ముందే ఎండాకాలంలో పూర్తి చేస్తుంటుంది. కానీ నగరం నడి బొడ్డున ఉన్న నాంపల్లి(Nampally) నియోజకవర్గం పరిధిలోని అహ్మద్ నగర్ డివిజన్ లోని పోలీస్ మెస్ మెయిన్ రోడ్డు నిర్మాణ పనులను పక్షం రోజుల ముందే ప్రారంభించారు. పాత రోడ్డును తొలగిస్తున్న పనులు ప్రస్తుతం చురుకుగా సాగుతున్నాయి. పోలీస్ మెస్ నుంచి రాక్ చర్చి మీదుగా అహ్మద్ నగర్ వెళ్లే రోడ్డును పూర్తిగా తవ్వి వదిలేయటంతో వాహనాల రాకపోకలను నిపిలివేశారు. ఫలితంగా వయా చాచా నెహ్రూపార్కు మీదుగా మాసాబ్ ట్యాంక్ వెళ్లే వాహానాలు ఫస్ట్ లాన్సర్ రోడ్డులో జామ్ అవుతున్నాయి. పైగా సరోజినీ దేవి కంటి ఆస్పత్రి పక్కనే ఉన్న బస్టాపు వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బోర్డు వాహనా దారులకు మరిన్ని కష్టాలు తెచ్చి పెడుతుంది.

తక్కువ ట్రాఫిక్ ఉండే రూట్ అంటూ ఏర్పాటు చేసిన బోర్డును నమ్ముకుని పంజాగుట్ట(Panjagutta), బంజారాహిల్స్(Banjara Hills) వెళ్లే వాహనదారులు ఈ రూట్ లో వచ్చి ఓవైసీపురా క్రాస్ రోడ్డు(Oyc Cross Road) వద్ద ట్రాఫిక్ లో చిక్కుకుంటున్నారు. రాక్ చర్చి నుంచి పోలీస్ మెస్ వెళ్లే దారి తవ్వి వదిలేయటంతో వాహనదారులు ఓవైసీపురా, ఎంజీనగర్ మీదుగా గార్డెన్ టవర్ వరకు చేరుకుని అక్కడి నుంచి పంజాగుట్ట, బంజారాహిల్స్ , లక్డీకాపూల్ వైపు వెళ్తున్నారు. ఇదే తరహాలో రాంనగర్ రాజ్ ఫంక్షన్ హాల్ ఎదురుగా, చిక్కడపల్లిలో సీవరేజీ పనులంటూ రోడ్డు తవ్వి వదిలేశారు. దీనికి తోడు జీహెచ్ఎంసీ(GHMC) పూర్వ కమిషనర్ లోకేశ్ కుమార్(Lokesh Kumar) నివాసముండే బంజారాహిల్స్ రోడ్ నెం.10లో కూడా రోడ్డును తవ్వి వదిలేయటంతో వాహనదారుల ఇబ్బందులు వర్ణణాతీతం. మెంట్ కాంపౌండ్ నుంచి బడా గణేశ్ వైపు వెళ్లే రోడ్ ను పూర్తిగా మూసివేసిన కారణంగా వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

Also Read: Pakistani Couple: కోటి ఆశలతో భారత్ బాట.. థార్ ఎడారిలో విగతజీవులుగా పాక్ జంట..!

 

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది