Hydraa: మూసపేటలో అక్రమ ఆక్రమణలపై హైడ్రా కొరడా
Hydraa (imagecredit:swetcha)
హైదరాబాద్

Hydraa: మూసాపేటలో అక్రమ ఆక్రమణలపై హైడ్రా కొరడా

Hydraa: మూసాపేట(Moosapet)లోని ఆంజనేయ నగర్లో హైడ్రా(Hydraa) ఆక్రమణల తొలగించింది. 2000 గజాల విస్తీర్ణంతో ఉండే పార్కు స్థలంలో కబ్జాలను మంగళవారం హైడ్రా తొలగించింది. హుడా(Huda) లేఔట్ ప్రకారం 2000 గజాలను పార్కు కోసం కేటాయించిన స్థలంగా నిర్ధారించింది. పార్కు స్థలాన్ని కబ్జా చేసేందుకు యాసిన్(Yasin) ప్రయత్నంచాడు. రోడ్డుకు ఒకవైపు టెంట్ సామాన్ల దుకాణం నిర్వహిస్తున్న యాసిన్. దుకాణానికి ఎదురుగా ఉన్నటువంటి 2 వేల గజాల పార్కు స్థలంలో అతని టెంట్ సామాన్లు, సౌండ్ సిస్టమ్ మెటీరియల్, జనరేటర్ల రిపేరింగ్ తదితర వ్యాపార కార్యక్రమాలకు వినియోగ వస్తువులను పార్కులో ఉంచేవాడు.

Also Read: Fake Embassy: నకిలీ ఎంబసీ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి

ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన
గతంలో ఈ పార్కు అభివృద్ధికి ప్రభుత్వం రూ. 50 లక్షల రూపాయలను విడుదల చేసి GHMC కి అప్పగించింది. దీంతో జీహెచ్ఎంసీ(GHMC) పార్కు చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే పనులను అడ్డుకున్న యాసిన్, అతని అనుచరులు అడ్డుకున్నారు. లేఔట్ ప్రకారం ఎలా ఉంటే అలానే పార్కును ఆభివృద్ధి చేయాలంటూ అక్కడి స్థానికుల డిమాండ్ చేశారు. దీంతో Ghmc, పోలీస్ స్టేషన్లో కబ్జాలపై స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ పారకరు కబ్జావిషయమై అక్కడి స్ధానికులు హైడ్రా(Hydraa)కు ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేసారు.

లేఔట్ ప్రకారం 2 వేల గజాలు
ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారుల పార్కు స్థలంపై పూర్తి స్థాయిలో విచారించి అనంతరం లేఔట్ ప్రకారం 2 వేల గజాల స్థలం పార్కు(Park) కోసం కేటాయించినట్టు నిర్ధారణ చేశారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా పార్కులో ఆక్రమణలను తొలగించి పార్కు స్ధలాన్ని కాపాడింది.

Also Read: Cancer: షాకింగ్.. ధూమపానం చేయని వారిలో కూడా తల, మెడ క్యాన్సర్‌?

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..