Hydra Ranganath(image credit:X)
హైదరాబాద్

Hydra Ranganath: వివాదాస్పద భూమిలో మారణాయుధాలు.. అవాక్కైన కమీషనర్..

Hydra Ranganath: హైడ్రా కమీషనర్ రంగనాథ్ కోహెడ లోని సర్వే నెంబర్ 951, 952 లో వివాదాస్పద భూమిని పరిశీలించారు. అనంతరం అక్కడ ఉన్న వివాదాస్పద భూమిలో మారణాయుధాలను చూసి అవాక్కయ్యారు.

గత కొంత కాలంగా స్థలం కొనుగోలుదారులకు ఫాంహౌస్ యజమానికి మధ్య వివాదం నడుస్తున్నది. దీంతో ఫాం హౌజ్ ఓనర్ ప్లాటు యజమానులపై మారణాయుధాలతో దాడి చేయడం జరిగింది. దాడి చేసిన నిందితుల పైన హత్యాయత్నం కేసు పెట్టకపోగా కబ్జా చేసిన వారికే వత్తాసు పలకడంతో రంగనాథ్, స్థానిక CI పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

రంగనాథ్ మాట్లాడుతూ.. మీరు కొనుగోలు చేసిన స్థలాన్ని ఎవరైనా కబ్జా చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుందని CI నీ ప్రశ్నించారు. ఇలాంటి సంఘటనలు జరుగుతున్న పరిణామాలతోనే హైడ్రా పోలీసు స్టేషన్ ఏర్పాటు చేసి బాధితులకు భరోసా కల్పిస్తున్నామని కబ్జా చేసిన వారు ఎవ్వరైనా ఉపేక్షించేది లేదని రంగనాథ్ తెలిపారు.

హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. సరైన అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అదే విధంగా లేఅవుట్లు, ఫాం హౌజ్‌ల పేరుతో కబ్జాలు చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు