Sewer Croc Robotic Device( image credit: swetcha reporter)
హైదరాబాద్

Sewer Croc Robotic Device: ఇకా మ్యాన్‌హోల్‌లో ఎవరు దిగరు.. GHMC కొత్త రోబో పరికరం ఇదే!

Sewer Croc Robotic Device: మురుగు నీటి పైపు లైన్ల‌లో పేరుకుపోయిన సిల్ట్‌ను తొల‌గించే  సీవర్ క్రోక్  రోబోటిక్ ప‌రిక‌రం ప‌నితీరును హైడ్రా, జీహెచ్ ఎంసీ క‌మిష‌న‌ర్లు ఏవీ రంగ‌నాథ్‌, ఇలంబ‌ర్తి  క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించారు. రోబోటిక్, వాటర్-జెట్ శక్తితో నడిచే ఈ పరికరం సిల్ట్‌ను తొల‌గించే విధానాన్ని గ‌మ‌నించారు. స‌చివాల‌యం ముందు ఉన్న డైన్ల‌లో ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రీక్షించారు. మురుగు, వ‌ర‌ద నీరు పొంగి ర‌హ‌దారుల‌ను ముంచెత్త‌డం న‌గ‌రంలో స‌ర్వ సాధార‌ణ‌మైన ప‌రిస్థితుల్లో సీవ‌ర్ క్రోక్ ఎంత‌వ‌ర‌కు ఉప‌యోగ‌ప‌డుతుంద‌నేది ఇరువురు క‌మిష‌న‌ర్లు ప‌రిశీలించారు.

 Also Read: National Award to Telangana: అవార్డు విజేత మాల్ పంచాయతీ.. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రశంసలు!

వాటర్ జెట్‌తో టర్బైన్‌ను తిప్పడంతో ముందుకు వెళ్లి బ్లేడ్ల సాయంతో చెత్త‌ను తొల‌గించే విధానాన్ని గ‌మ‌నించారు. మ్యాన్‌హోల్‌లో మ‌నుషులు దిగాల్సిన ప‌ని లేకుండా చెత్త‌ను తొల‌గించే తీరును ప‌రిశీలించారు. మురుగు ముప్పున్న‌ ప్రాంతాల‌ను పైల‌ట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకుని అక్క‌డ ఈ విధానాన్ని అమ‌లు చేయాల‌ని ఇరువురు క‌మిష‌న‌ర్లు నిర్ణ‌యించారు.

మురుగునీటి లైన్‌లను శుభ్రం చేయడానికి సీవర్ క్రోక్‌ను గ‌తంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWS&SB) వినియోగించిన విష‌యాన్ని అజంతా టెక్నో సొల్యూష‌న్స్ సంస్థ చీఫ్ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ జ‌ర్మ‌య్య‌ ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు