Hydraa (imagcredit:swetcha)
హైదరాబాద్

Hydraa: సున్నం చెరువులో బోర్ల తొలగింపు.. నీటి ట్యాంకర్లు సీజ్!

Hydraa: సున్నం చెరువు పున‌రుద్ధర‌ణ ప‌నుల‌ను హైడ్రా(hydraa) స్పీడ‌ప్ చేసింది. ఈ క్రమంలో ఫుల్ ట్యాంక్ ప‌రిధిలో మిగిలిన ఆక్రమ‌ణ‌ల‌ను తొల‌గించింది. విష‌పూరితమైన వాటర్ అని తెలిసినా చెరువు ఆవ‌ర‌ణ‌లో బోర్ల ద్వారా నీటి వ్యాపారం చేస్తున్న వారిపై చ‌ర్యలు తీసుకుంది. ప‌దుల సంఖ్యలో ఉన్న బోర్లను తొల‌గించ‌డ‌మే గాకా, ట్యాంక‌ర్లను సీజ్ చేసినట్లు హైడ్రా వెల్లడించింది. బోర్లుకు ఆనుకుని వేసిన షెడ్డుల‌ను కూడా హైడ్రా తొల‌గించింది.

పీసీబీ ద్వారా ప‌రీక్షలు చేయించి, అక్కడి నీరు చాలా ప్రమాద‌క‌ర‌మ‌ని వివ‌రించినా ప‌ట్టించుకోకుండా నీటి దందా చేస్తున్నవారిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించింది. త‌న నీటి వ్యాపారం కొన‌సాగిస్తూ, చాలు అని హైడ్రా విదుల‌కు ఆటంకం క‌లిగిస్తున్న వెంక‌టేష్‌ అనే వ్యక్తిపై మాదాపూర్ పోలీసుల‌కు హైడ్రా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. ఈ మేర‌కు వెంక‌టేష్‌(Venkatesh)ను మాధాపూర్ పోలీసు(Madhapur Police)లు అరెస్టు చేశారు.

ఎఫ్‌టీఎల్ ప‌రిధిలోని ఆక్రమ‌ణ‌పైనే చ‌ర్యలు

1970లో స‌ర్వే ఆఫ్ ఇండియా(Survey Of India) టోపో షీట్‌ల ప్రకారం సున్నం చెరువు విస్తీర్ణం 26 ఎక‌రాలు. ఈ క్రమంలోనే 2016లో హెచ్ఎండీ(HMDA)ఏ ఈ చెరువు విస్తీర్ణాన్ని 32 ఎక‌రాలుగా పేర్కొంటూ ప్రాథ‌మికంగా నిర్ధారించింది. అలాగే 2014లో ఇరిగేష‌న్ శాఖ‌(Irrigation Department), రెవెన్యూ శాఖ‌(Revenue Department)లు నిర్ధారించిన హ‌ద్దుల మేర‌కే న‌గ‌రంలో చెరువుల పున‌రుద్ధర‌ణ జ‌రుగుతోందని హైడ్రాHydraa) స్పష్టం చేసింది. సున్నం చెరువు విష‌యంలో కూడా అలాగే అభివృద్ధి చేస్తున్నామ‌ని హైడ్రా క్లారిటీ ఇచ్చింది.

అందుకే అక్కడ గ‌తంలో వేసిన లే ఔట్‌ను ఏళ్ల క్రితం హుడా(Huda) ర‌ద్దు చేసినట్లు పేర్కొంది. చెరువు ఎఫ్‌టీఎల్(FTL) ప‌రిధిలో ఉన్నందునే అక్కడ నిర్మాణాలు చేప‌ట్టడానికి 10 ఏళ్లుగా అనుమ‌తులు ఇవ్వడంలేదని పేర్కొంది. కోర్టు కేసుల్లో ఈ అంశం ఉంద‌ని అక్కడి ప్లాట్ య‌జ‌మానులు చెబుతున్నారని, ఎవరైనా న‌ష్టప‌రిహారానికి అర్హుల‌మ‌ని భావిస్తే వెంట‌నే ప్రభుత్వానికి ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని హైడ్రా సూచించింది. అలాగే టీడీఆర్ (Transferable Development Rights) కింద కూడా చ‌ట్ట ప్రకారం న‌ష్టప‌రిహారం పొంద‌వ‌చ్చున‌ని హైడ్రా వెల్లడించింది.

Also Read: White House: ట్రంప్ ప్రపంచాన్ని రక్షించారు.. ఆయన శాంతికాముకుడు.. వైట్ హౌస్!

వేగవంతమైన చెరువు పున‌రుద్ధర‌ణ ప‌నులు..

మాదాపూర్ ఐటీ(IT) కారిడార్‌కు సమీపంలో, బోరబండ బ‌స్తీకి ఆనుకుని గుట్టల‌బేగంపేట వ‌ద్ద ఉన్న సున్నం చెరువు పున‌రుద్ధర‌ణ ప‌నులు వేగవంతమయ్యాయి. చెరువులో కొన్ని ద‌శాబ్దాలుగా రెండు మూడు మీట‌ర్ల మేర పోగైన ప్లాస్టిక్ వ్యర్థాలతో పాటు చెత్తను తొల‌గించినట్లు హైడ్రా వెల్లడించింది. చెరువులోకి మురుగు నీరు క‌ల‌వ‌కుండా డైవ‌ర్ట్ నాలాల‌ను ఏర్పాటు చేసింది. వ‌ర్షపు నీరు సుల‌భంగా చేరేలా ఏర్పాట్లు చేస్తోంది. చెరువు చుట్టూ బండ్ ఏర్పాటు చేసి వాకింగ్ ట్రాక్‌లు నిర్మించే ప‌నుల‌కు కూడా శ్రీ‌కారం చుట్టింది.

అలాగే పిల్లలు ఆడుకునేందుకు చిల్డ్రెన్స్ పార్కు(Childrence Park), ఓపెన్ జీమ్‌(Open Zym)ల‌ను ఏర్పాటు చేసి, ప‌రిస‌ర ప్రజ‌ల‌కు ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణాన్నికల్పించేందుకు చ‌ర్యలు తీసుకుంటున్నట్లు హైడ్రా వెల్లడించింది. దోమ‌లు, క్రిములు, కీట‌కాల‌తో దుర్గంధ భ‌రితంగా ఉన్న వాతావ‌ర‌ణం తొల‌గిపోవ‌డంతో అక్కడ ఇంటి కిరాయిలు పెరిగినట్లు వెల్లడించింది. ఇంటి స్థలాల ధరలు కూడా పెరిగాయ‌ని స్థానికులు వెల్లడించారు.

Also Read: Anchor Swetcha: పూర్ణ చందర్‌ రిమాండ్‌లో సంచలనం.. బీఆర్ఎస్ కీలక నేత పేరు!

 

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?