Drugs Seized: హాష్ ఆయిల్ విక్రేతల అరెస్ట్.. డ్రగ్స్ స్వాధీనం
Hash Oil Seizure (image Credit: swetcha reporter)
హైదరాబాద్

Drugs Seized: హాష్ ఆయిల్ విక్రేతల అరెస్ట్.. 9 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం

Drugs Seized: నగరంలో హాష్ ఆయిల్ విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 9 లక్షల విలువైన 1,770 గ్రాముల హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాస రావు తెలిపిన వివరాల ప్రకారం.. బోయిన్‌పల్లి (Boynpally)కి చెందిన పండ్ల వ్యాపారి సాహూ సోనూ (31), ఎల్బీనగర్‌(LB Nagar)కు చెందిన ఫ్లిప్‌కార్ట్ డెలివరీ బాయ్ బండారి రవితేజ(Bandari Ravi Teja) (20) స్నేహితులు. వీరికి బోయిన్‌పల్లి(Boynpally)కి చెందిన గిరితో పరిచయం ఉంది.

 Also Read: Hyderabad Rains: హైదరాబాద్‌కు హై అలెర్ట్.. ఈ ప్రాంతాలు మునగబోతున్నాయ్.. తస్మాత్ జాగ్రత్త!

1,770 గ్రాముల హాష్ ఆయిల్

ఈ ముగ్గురికీ గంజాయి సేవించే అలవాటు ఉండగా, గిరి తరచుగా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి కొనుగోలు చేసి వారికి కొంత ఇచ్చి మిగతాది అమ్ముకునేవాడు. గతంలోనూ వీరు పట్టుబడి జైలుకు వెళ్లారు. అయితే, ఈసారి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్న సోనూ, రవితేజలు గిరిని హాష్ ఆయిల్ సరఫరా చేయమని కోరారు. గిరి ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) కు చెందిన రాజేశ్ నుంచి 1,770 గ్రాముల హాష్ ఆయిల్ తెప్పించి వీరికి అందించాడు.

టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం

ఈ హాష్ ఆయిల్‌ను విక్రయించేందుకు రాత్రి ఓల్డ్ బోయిన్‌పల్లి(Boynpally)లోని ఇక్రిశాట్ ఫేజ్-2 గేటు వద్ద సోనూ, రవితేజలు నిలబడి ఉండగా, టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. టాస్క్ ఫోర్స్(Task Force) సీఐ నాగార్జున,(CI Nagarjuna0 ఎస్ఐలు అనంతచారి, నాగరాజు, కరుణాకర్ రెడ్డి(Karunakar Reddy)బృందం తనిఖీలు నిర్వహించి ఇద్దరినీ అరెస్ట్ చేసింది. నిందితుల నుంచి హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ నిమిత్తం బోయిన్‌పల్లి (Boynpally) పోలీసులకు అప్పగించారు. గిరి, రాజేశ్ కోసం పోలీసులు(Police)  గాలిస్తున్నారు.

 Also Read: Gadwal Rains: మూడు రోజులపాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. జిల్లా కలెక్టర్ కీలక సూచనలు

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క