VC Sajjanar: మేరా డాడీ కౌన్ హై మాలూం…ఓ సినిమాలో పీకలదాకా మందు తాగి కారు డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డ వ్యక్తి పోలీసులకు ఈ ప్రశ్న వేస్తాడు. ఆ తరువాత పోలీసులు సదరు వ్యక్తిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి తమదైన శైలిలో మర్యాదలు చేస్తారు. న్యూ ఇయర్ వేడుకలు సమీపించిన నేపథ్యంలో డ్రంకెన్ డ్రైవ్ పై ప్రత్యేక దృష్టి సారించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీ.సీ.సజ్జనార్ మందుబాబులకు ఇలాగే స్వీట్ వార్నింగ్ ఇస్తూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. మియా డ్రింక్ కరే క్యా?…క్యాబ్ కో కాల్ కరో…వకీల్ సాబ్ కు నహీ అంటూ అందులో వ్యాఖ్యానించారు. తద్వారా మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈసారి కొత్త సంవత్సరం వేడుకలు డ్రగ్స్ ఫ్రీగా జరిగేలా చూడటానికి కట్టుదిట్టమైన చర్యలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
Also Read: Lorry Hits Bike: అక్కడికక్కడే అక్కాతమ్ముడి మృతి.. సత్తుపల్లిలో ఘోర ప్రమాదం
మందు కొట్టి దొరికితే డాడీ ఎవరో తెలుసా?
అదే సమయంలో డ్రంకెన్ డ్రైవింగ్ కు బ్రేకులు వేయటానికి కూడా చర్యలు తీసుకున్నారు. దీంట్లో భాగంగా కమిషనరేట్ పరిధిలోని వేర్వేరు చోట్ల ఇప్పటికే డ్రంకెన్ డ్రైవింగ్ టెస్టులను ముమ్మరంగా జరుపుతున్నారు. మందు కొట్టి ఎవరు దొరికినా వారిపై కేసులు నమోదు చేసి వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా కమిషనర్ సజ్జనార్ ఎక్స్ లో ట్వీట్ చేస్తూ మందు కొట్టి దొరికిన తరువాత మా డాడీ ఎవరో తెలుసా?…మా అంకుల్ ను గుర్తు పడతారా? అని చెబితే కుదరదని తేల్చి చెప్పారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుండటంతోపాటు దారిని వెళుతున్న వారి జీవితాలతో చెలగాటాలాడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఇలాంటి వారికి 10వేల రూపాయల జరిమానా విధిస్తామని తెలిపారు. ఇక, డ్రంకెన్ డ్రైవింగ్ కేసుల్లో ఆరు నెలల జైలుశిక్ష పడే అవకాశాలు కూడా ఉన్నాయని హెచ్చరించారు.
Also Read: CM Revanth Reddy: పాలమూరు ప్రాజెక్టు రిపోర్టును సిద్ధం చేయండి: సీఎం రేవంత్ రెడ్డి

