Dog Attacks Owner: సాధారణంగా శునకాలంటే విశ్వాసానికి మారు పేరుగా చెబుతుంటారు. అదే పెంపుడు కుక్కలు అయితే యజమానిపై ఏ స్థాయిలో ప్రేమను కురిపిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యజమాని బయట నుంచి ఇంట్లో అడుగుపెట్టగానే ఎంతో అప్యాయంగా పరిగెత్తుకొని వెళ్తుంటాయి. అతడిపై అపార ప్రేమను చూపిస్తుంటాయి. అలాంటిది ఓ శునకం ఏకంగా యజమాని ప్రాణాన్నే బలిగొంది. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటన డాగ్ లవర్స్ ను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది.
వివరాల్లోకి వెళ్తే…
ఏపీలోని కృష్ణాజిల్లాకు పవన్ కుమార్ (37) గత ఐదేళ్లుగా హైదరాబాద్ లో ఉంటున్నాడు. స్నేహితుడు సందీప్ తో కలిసి మధురానగర్ లోని ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. నగరంలోని ఓ ప్రైవేటు సంస్థలో క్యాషియర్ పనిచేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అయితే పవన్ (Pawan Kumar)కు ఓ పెంపుడు శునకం ఉంది. హస్కీ జాతికి చెందిన ఆ శునకాన్ని పవన్ ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. దానికి కావాల్సిన ఆహారాన్ని అందిస్తూ ఎంతో అప్యాయత కురిపించేవాడు.
స్పందించని పవన్
అయితే ఇటీవల పవన్.. అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో ఆఫీసుకు సైతం సెలవు పెట్టి ఇంట్లోనే ఉంటున్నాడు. స్నేహితుల సాయంతో ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో రోజులాగే శనివారం రాత్రి 11 గం.లకు పవన్.. తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. ఆ సమయంలో పెంపుడు శునకం సైతం అతడితో పాటే గదిలో ఉంది. అయితే ఉదయం రూమ్ మేట్ సందీప్ తలుపు కొట్టగా పవన్ స్పందించలేదు. ఎంతగా అరిచిన డోర్ తీయలేదు.
శునకం నోటి నిండా రక్తం
పవన్ ఎంతకీ తలుపు తీయకపోవడంతో సందీప్ లో ఒక్కసారిగా భయం పెరిగిపోయింది. చుట్టుపక్కల వారికి విషయం చెప్పడంతో వారు పవన్ ఉన్న గది వద్దకు వచ్చారు. తలుపు పగలకొట్టి చూడగా రూమ్ లో పవన్ విగతజీవిగా పడి కనిపించాడు. అతడి ప్రైవేట్ పార్ట్స్ రక్తంతో ఉన్నాయి. పక్కనే ఉన్న పెంపుడు శునకం నోటి నిండా బ్లడ్ ఉంది. దాంతో కుక్క అతని ప్రైవేట్ పార్ట్స్ తినడం వల్లే పవన్ మరణించి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు.
Also Read: Janulyri Divorce: జాను లిరీ మొదటి భర్త అంత పని చేశాడా.. అందుకే విడాకులు ఇచ్చిందా?
కేసు నమోదు
ఇదిలా ఉంటే పవన్ కు గతంలోనే వివాహమైంది. వ్యక్తిగత కారణాలతో భార్యతో విడాకులు తీసుకున్నాడు. ప్రస్తుతం ఒక్కడే ఉంటున్నాడు. మరోవైపు స్నేహితుడు సందీప్ ఫిర్యాదుతో మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఘటనకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.