Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ నియోజక వర్గంలో వచ్చే నెల నవంబర్‌లో ఉపఉన్నిక జరగనుంది. అందుకు గాను ప్రభుత్వం దీనికోసం కీలక నిర్నయం తీసుకుంది. ఉప ఎన్నిక సందర్బంగా ఈ నియోజక వర్గంలోని అన్నీ ప్రభుత్వ కార్యాలయాల(Government offices)కు మరియు విద్యాసంస్ధలకు ఆ రోజున సెలవు(Holiday) ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులును జారీ చేసింది. ఉప ఎన్నిక సమయంలో అక్కడ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగడానికి ప్రభుత్వం ఇ నిర్నయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. ఈ ప్రత్యేక సెలవు హైదరాబాద్(Hyderabada0 లోని జూబ్లీహిల్స్ నియోజక వర్గంలో మాత్రమే అమలులో ఉంటుందని తెలిపింది. రాష్ట్రంలోని ఇతర జిల్లాలో మండలాల్లో రోజు వారిలాగా సాదారణ విధులు సాగుతాయిని తెలిపింది.
Also Read: TUWJ: జర్నలిస్టుల హెల్త్ కార్డుల కోసం కృషి చేస్తాం.. టీయూడబ్ల్యూజే సభ్యుల కీలక వ్యాఖ్యలు
నియోజకవర్గంలో పోటీ చేయనున్న..
ఇటు అధికార పార్టీ కాంగ్రెస్ నుండి నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ బరిలో దిగారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా పార్టీ లంకల్ దీపక్ రెడ్డికి టికెట్ కేటాయించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు దీపక్ రెడ్డికి బీ ఫామ్ అందజేశారు. కాగా ఈనెల 21న భారీ ర్యాలీగా నామినేషన్ వేయనున్నట్టు ఆయన తెలిపారు. కేంద్ర మంత్రులు సైతం ఈ కార్యక్రమానికి హాజరవ్వనున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుండి మాగంటి సునిత పోటీలో దిగారు. దీంతో అటు అధికార పార్టీనుండి ఇటు ప్రతిపక్షపార్టీలు ఎలాగైనా గెలవాలని తీవ్రంగా పోటీ పడుతున్నాయి.
Also Read: Maoists Surrender: మావోయిస్టుల మెగా సరెండర్.. ఒకేరోజు 206 మంది లొంగుబాటు!
