Crime News: కత్తితో గొంతు కోసం మరదలిని కిరాతకంగా హత్య చేశాడు మేన బావ. అదీ హతురాలి తల్లిదండ్రులు చూస్తుండగానే. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ దారుణం వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాపూజీనగర్ వాస్తవ్యులైన లక్ష్మీ, కాంతారావు భార్యాభర్తలు. వీరి కూతురు పవిత్ర (17) ఇంటర్మీడియెట్ విద్యార్థిని. ఇదిలా ఉండగా పవిత్ర(Pavuthra)కు మేన బావ అయ్యే ఉమా శంకర్(Uma Shankar) కొన్నిరోజులుగా తనను పెళ్లి చేసుకోవాలని అడుగుతూ వస్తున్నాడు. ఇదే విషయాన్ని లక్ష్మీ, కాంతారావులకు కూడా చెప్పాడు.
Also Read: Bigg Boss 9 Telugu: ప్రోమో అదిరింది.. పోగొడుతూనే హౌస్ మేట్స్ మధ్య చిచ్చు పెట్టిన బిగ్ బాస్
నన్ను వివాహం చేసుకుంటావా?
అయితే, ఉమా శంకర్ కు మద్యం సేవించే అలవాటు ఉండటం, చేస్తున్న టైల్స్ వృత్తి(Tiles profession)లో స్థిరపడక పోవటంతో కూతురిని ఇచ్చి వివాహం చేయటానికి వాళ్లు అంగీకరించ లేదు. కాగా, సోమవారం మధ్యాహ్నం మరోసారి ఇంటికి వచ్చిన ఉమా శంకర్ కూతురునిచ్చి పెళ్లి చేస్తారా? లేదా? అని లక్ష్మీ, కాంతారావులను అడిగాడు. పెళ్లి చేసేది లేదని వాళ్లు చెప్పటంతో నన్ను వివాహం చేసుకుంటావా? అని పవిత్రను అడిగాడు. దానికి ఆమె కూడా నిరారించింది. దాంతో వెంట తెచ్చుకున్న కత్తితో పవిత్రపై దాడి చేసిన ఉమా శంకర్ ఆమె గొంతును కోసివేశాడు. దాంతో రక్తం మడుగులో కుప్పకూలిపోయిన ఆమె అక్కడికక్కడే చనిపోయింది. విషయం తెలియగానే సంఘటనా స్థలానికి చేరుకున్న వారాసిగూడ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. పరారీలో ఉన్న ఉమా శంకర్ కోసం గాలిస్తున్నారు.

