Hyderabad GPO: హైదరాబాద్ జనరల్ పోస్టాఫీస్ (Hyderabad General Post Office – GPO)లో నేటి నుంచి (అక్టోబర్ 15) 24×7 స్పీడ్ పోస్టు బుకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇందుకోసం పోస్టాఫీసులో ప్రత్యేకంగా రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య ప్రత్యేక నైట్ షిఫ్ట్ సేవలను ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ హైదరాబాద్ జీపీఓ ప్రత్యేక ప్రకటనను సైతం విడుదల చేసింది. నైట్ షిఫ్ట్ అందుబాటులోకి రావడంతో.. నిరంతరాయం స్పీడ్ పోస్ట్ సేవలు పొందవచ్చని తెలిపింది. ఇకపై వినియోగదారులు ఏ సమయంలో నైనా డాక్యుమెంట్లు, పార్శిళ్లు పంపేందుకు వీలు కలుగుతుందని పేర్కొంది. వినియోగదారులు ఈ 24/7 సేవలను వినియోగించుకోవాలని హైదరాబాద్ జీపీఓ తాజా ప్రకటనలో కోరింది.
Also Read: Shocking Video: బస్సు కిందపడబోయిన బైకర్.. హీరోలా కాపాడిన కానిస్టేబుల్.. ఎలాగో మీరే చూడండి!
ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల తరహాలో ఇటీవల కాలంలో పోస్టాఫీసు తన సేవలను మరింత విస్తరించింది. ఉత్తరాల పార్శిల్స్ తో పాటు డబ్బు పొదుపునకు సంబంధించి అధునాతన స్కీమ్స్ ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రైల్వే టికెట్లను బుక్ చేసుకునే వెసుసుబాటును సైతం పోస్టాఫీసు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 333 పోస్టాఫీసుల్లో రైల్వే టికెబ్ బుకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇది గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పోస్టాఫీసు వర్గాలు ప్రకటించాయి.
