Food safety department(image credit:X)
హైదరాబాద్

Food safety department: కల్తీ ఆహారంపై సర్కార్ సీరియస్.. పుడ్ సేఫ్టీకి కొత్త టార్గెట్స్!

Food safety department: రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీని మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. దీంతోనే ఫుడ్ ఇన్ స్పెక్టర్లకు తాజాగా టార్గెట్స్ ఇచ్చారు. ఒక్కో ఆఫీసర్ ప్రతి నెల 35 శాంపిళ్లను కచ్చితంగా కలెక్ట్ చేయాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు.

శాంపిల్ సేకరణ, టెస్టింగ్ వంటివి ఫర్ ఫెక్ట్ గా చేసి ఎప్పటికప్పుడు తమ కార్యాలయానికి రిపోర్టు అందించాల్సిందిగా కమిషనర్ ఆర్ వీ కర్ణన్ సూచించారు. కల్తీ ఆహారం నియంత్రణలో భాగంగా ఆహార ఉత్పత్తి యూనిట్లు, హోటళ్లలో తీసే శాంపిల్స్ సంఖ్యను పెంచాల్సిందిగా నొక్కి చెప్పారు.

గ్రేటర్ హైదరాబాద్ పై ఫోకస్ పెంచాలన్నారు. ఆహర భద్రత, ప్రమాణాలు మెరుగు పడాలని కమిషనర్ వివరించారు. ఈ మేరకు పుడ్ సెప్టీ అధికారులతో కమిషనర్ ప్రత్యేక రివ్యూ నిర్వహించారు. కల్తీ ఆహారాన్ని కంట్రోల్ చేసేందుకు టీమ్ లన్నీ సమన్వయంతో పనిచేయాలన్నారు.

ప్రజారోగ్య దృష్ట్యా ఎక్కడా లోపాలు రాకూడదన్నారు. గతంలో పోల్చితే పుడ్ సేఫ్టీ టీమ్ ల పనితీరు మెరుగుపడిందని, మరింత స్పీడ్ గా వర్క్ చేయాల్సిన అవసరం ఉన్నదని కర్ణన్ వివరించారు. ఇక ఆహారం కల్తీ చేసే వారిపై కఠిన చర్య లు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది.

Also read: Appi Reddy on Jagan: భద్రతపై నిర్లక్ష్యం.. సర్కారుపై ఎమ్మెల్సీ ఫైర్!

నిత్యం గ్రేటర్ హైదరాబాద్ లో ఫిర్యాదులు రావడంతో పాటు కల్తీ ఆహారం తిని అస్వస్థతకు గురైన బాధితుల సంఖ్య కూడా పెరుగుతుంది. దీంతో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు సీరియస్ గా ఈ అంశంపై దృష్టి కేంద్రీకరించారు. హెల్త్ మినిస్టర్ ఆదేశాలతో పుడ్ సేప్టీలో కొత్త విధానాలను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

అరకొర శాంపిల్ సేకరణ…?
ప్రస్తుతం పుడ్ సేఫ్టీ ఆఫీసర్లు శాంపిల్ సేకరణలో అలసత్వం వహిస్తున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. గ్రేటర్ హైదరాబాద్ లో పుడ్ సేఫ్టీ విభాగం వీక్ గా ఉన్నదని కంటిన్యూగా ఫిర్యాదులు వస్తున్నాయని స్వయంగా ఉన్నతాధికారులే చెప్తున్నారు.

ఒక్కో ఆఫీసర్ నెలలో కనీసం ఐదారు శాంపిల్ కూడా సేకరించడం లేదు. పైగా టెస్టింగ్ ప్రాసెస్ ను కూడా సరిగ్గా ఫాలప్ చేయలేకపోతున్నారు. దీని వలన కల్తీ ఆహార ఉత్పత్తి కేంద్రాలు, హోటళ్ల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే టార్గెట్ విధానాన్ని తీసుకువస్తున్నట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. దీంతో పాటు స్పెషల్ రెయిడ్స్ నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

‘‘త్వరలో మినీ ల్యాబ్స్: పుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్
ఎక్కడికక్కడ ఆహార టెస్టింగ్ చేసేందుకు త్వరలో మినీ ల్యాబ్స్ ను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. అడిషనల్ గా స్టాఫ్​ ను రిక్రూట్ చేయబోతున్నాం. హైదరాబాద్ వంటకాల బ్రాండ్ పెరిగేలా చర్యలు తీసుకుంటాం. ఇక పుడ్ ఉత్పత్పి కేంద్రాలన్నీ తప్పనిసరిగా ఎఫ్​ ఎస్ ఎస్ ఏ ఐ లైసెన్సును తప్పనిసరిగా కలిగి ఉండాలి. జిల్లాల్లోనూ టీమ్ లను పటిష్టం చేయబోతున్నాం’’

తెలంగాణలో పుడ్ టెస్టింగ్ ప్రాసెస్ ఇలా…
(పార్లమెంట్ వివరాలు ప్రకారం)
సంవత్సరం శాంపిల్స్ కల్తీ శాతం
2021–22 3077 353 11.47
2022–23 4809 894 18.59
2023–24 6156 973 15.81
2024–25 1660 16

 

 

 

 

 

 

 

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు