Medical Services: హైదరాబాద్ జిల్లాలో మెడికల్ సర్వీసుల మెరుగుకు రూపకల్పన చేయనున్న డిజిటల్ మ్యాపింగ్ కు సంబంధించి స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక కార్యాచరణను సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు.
డిజిటల్ మ్యాపింగ్ పై మంగళవారం నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్ మెంట్ (ఎన్ఐయూఎం) కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన వ్యూహాత్మక సమావేశానికి కలెక్టర్ హాజరయ్యారు. సమావేశంలో భాగంగా యునిసెఫ్ బృందం డిజిటల్ మ్యాపింగ్ ప్రాముఖ్యత, ఉద్దేశ్యాలతో కూడిన వివరణ ఇచ్చింది.
Also read: Phone Tapping Case: ఛీటింగ్ కేసు.. శ్రవణ్ రావు అరెస్ట్ !
ఇందుకు తగిన విధంగా ఎన్ఐయూఎం కూడా పలు అంశాలను ప్రస్తావించింది. ముఖ్యంగా వివిధ దశలుగా మ్యాపింగ్ చేసి, సమీకృత విధానానికి జోడించాలని సూచించింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యంగా ప్రజారోగ్య వ్యవస్థలోని మెడికల్ సర్వీసులను ప్రభావితం చేసేలా డిజిటల్ మ్యాపింగ్ ఉండాలని సూచించారు.
ఇందుకు మూడు రకాల యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాల్సిన అవసరముందని కలెక్టర్ సూచించారు. జీఐఎస్ సాఫ్ట్ వేర్ తో ఇంటింటి సర్వే నిర్వహించి, జిల్లా వ్యాప్తంగా వ్యాక్సినేషన్ తో పాటు అన్ని రకాల వైద్య సేవలు వంద శాతం జిల్లా వ్యాప్తంగా కవర్ అయ్యేలా యాక్షన్ ప్లాన్ ఉండాలని కలెక్టర్ సూచించారు.