Hyderabad Crime: ఇన్వెస్ట్ మెంట్ ఫ్రాడ్ కేసులోని నిందితున్ని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు(Police )అరెస్ట్ చేశారు. నిందితుని నుంచి మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. సైబర్ క్రైం డీసీపీ డీ.కవిత( DCP Kavitha )తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తికి ఇటీవల ఓ ఫోన్ కాల్ వచ్చింది. తనను తాను టీనా మిట్టల్ గా పరిచయం చేసుకున్న వ్యక్తి డబ్ల్యు33బార్ క్లేస్ సంస్థ నుంచి మాట్లాడుతున్నట్టు చెప్పాడు.
Also Read: Khammam Collector: మామిడి రైతులకు గుడ్ న్యూస్.. ఈ ఉత్పత్తులతో ప్రజలకు ఆరోగ్యం.. జిల్లా కలెక్టర్
తమ వాట్సాప్ గ్రూప్ లో సభ్యునిగా చేరితే స్టాక్ ఎక్స్ ఛేంజ్ లో పెట్టుబడులకు సంబంధించి సలహాలు ఇస్తామన్నాడు. తద్వారా దండిగా లాభాలు సంపాదించ వచ్చని చెప్పాడు. ఇది నమ్మిన బాధితుడు వాట్సాప్ గ్రూప్ లో చేరి రెండు లక్షల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టాడు. ఆ తరువాత డబ్బును విత్ డ్రా చేసుకోవటానికి ప్రయత్నించగా కుదరలేదు. దాంతో టీనా మిట్టల్ కు ఫోన్ చేయగా పెట్టుబడిగా పెట్టిన రెండు లక్షలతోపాటు దానిపై వచ్చిన లాభాల్లో నుంచి అయిదు శాతం కమీషన్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
దాంతో మోసపోయినట్టు గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సీఐ కే.మధుసూదన్ రావు ఎస్సై కే.వెంకటేశ్, హెడ్ కానిస్టేబుళ్లు ఎం.ఏ.కరీం, మహేశ్వర్ రెడ్డి, కానిస్టేబుళ్లు సంపత్, సందీప్ లతో కలిసి విచారణ చేపట్టారు. తిలక్ నగర్ నివాసి ఫకీర్ శ్రీనివాస్ రెడ్డి ఈ నేరానికి పాల్పడినట్టుగా నిర్ధారించుకుని గురువారం అతన్ని అరెస్ట్ చేశారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు