Hyderabad Crime( image credit: TWITTER)
హైదరాబాద్

Hyderabad Crime: మద్యం మాయ.. సోదరుల మధ్య తగాదా.. బావ హత్యకు దారి!

Hyderabad Crime: మద్యం సేవించ వద్దని చెప్పిన పాపానికి బావను హత్య చేసిన బావమరిది ఉదంతమిది. స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించిన ఈ హత్య బంజారాహిల్స్​ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మాసాబ్​ ట్యాంక్​ నివాసి వాహెద్​ తన ఇద్దరు కుమారులు గౌస్​, సత్తార్​ లతో కలిసి చికెన్​ షాప్​ నడుపుతున్నాడు. కాగా, సత్తార్​ కొన్ని రోజులుగా మద్యానికి బానిసగా మారాడు. ఈ క్రమంలో డబ్బు కోసం తరచూ తండ్రి, సోదరునితో గొడవలు పడటం మొదలు పెట్టాడు.

 Also Read: AP Sainik Schools: ఏపీ సైనిక్ స్కూళ్లలో తెలంగాణ విద్యార్థులకు.. లోకల్ కోటా కొనసాగించాలి.. మెదక్ ఎంపీ!

కాగా, వాహెద్​ అల్లుడు ఇలియాస్​ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్​ 12లోని ఫస్ట్​ లాన్సర్​ లో ఉంటున్నాడు. మంచి మాటలు చెప్పి సత్తార్​ తో మద్యం మానిపించాలని ఇలియాస్​ పలుమార్లు ప్రయత్నించాడు. అయినా, సత్తార్​ లో మార్పు రాకపోవటంతో డబ్బు ఇవ్వకండని మామ వాహెద్, మరో బావమరిది గౌస్​ లతో చెప్పాడు. దాంతో సత్తార్ అతనిపై కక్ష పెంచుకున్నాడు.

రాత్రి సత్తార్ మద్యం కొనటానికి డబ్బు ఇవ్వమని తండ్రి, సోదరునితో గొడవ పడగా జోక్యం చేసుకున్న ఇలియాస్​ డబ్బు ఇచ్చేది లేదన్నాడు. దాంతో చికెన్​ షాప్​ కు వెళ్లి కత్తి తీసుకు వచ్చిన సత్తార్​ అతనిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ ఇలియాస్ అక్కడికక్కడే మరణించాడు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు సత్తార్ ను అరెస్ట్​ చేసి రిమాండుకు తరలించారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ