Miss World Contest: మిస్ వరల్డ్ పోటీలు చివరి అంకానికి చేరుకున్నా అన్ని వివరాలను ఇంకా గోప్యంగానే ఉంచుతున్నారు. ఎవరెవరు ఫైనల్ కు చేరుకున్నారు? వారు ఏయే దేశాలకు చెందినవారు అనేది కూడా ప్రకటించడం లేదు. మరోవైపు మిస్ వరల్డ్ పోటీలో భాగంగా అందాల భామలు గురువారం హోటల్ ట్రైడెంట్ లో రిహార్సల్స్ కొనసాగుతున్నాయి. శుక్రవారం, శనివారం ఉదయం వరకు అందాల భామలు రిహార్సల్స్ చేయనున్నారు. నృత్యంతోపాటు ఫైనల్ వేదికపై సత్తాచాటేందుకు పోటీపడి ప్రాక్టీస్ చేస్తున్నారు. కొందరు కంటెస్టెంట్స్ అరబిందో ఫార్మా, రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. మిస్ ఇండియా బ్యూటీ నందిని గుప్తాకు సామాజిక మాధ్యమాల్లో ‘ఆల్ ద బెస్ట్ ’అంటూ పోస్టులు వస్తున్నాయి. కాగా, ఆదివారం గ్రాండ్ ఫినాలే జరగనుండగా.. ఇంకా న్యాయనిర్ణేతలు, ఫైనల్ చేరిన అందాలరాశుల వివరాలు వెల్లడించలేదు. కంటెస్టెంట్స్ నగరంలో పర్యటించిన వివరాలను సైతం అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు.
మిస్ వరల్డ్ పోటీలు, వారి అనుభవం, తదితర అంశాలపై
ఫైనల్స్ కు ముందు అందాల భామలకు మల్టీ మీడియా ఛాలెంజ్ టాస్క్ పెట్టారు. ఇందుకోసం 20 మందిని ఎంపిక చేశారు. ఇన్ స్టాగ్రామ్, మిస్ వరల్డ్ యాప్, వారి ఫేస్ బుక్ పేజీలలో యాక్టివ్ గా ఉన్నవారిని ఒక్కో ఖండం నుంచి ఐదుగురిని ఎంపిక చేశారు. వీరికి ఫైనల్ గా ఒక ఛాలెంజ్ను నిర్వాహకులు ఇచ్చారు. మిస్ వరల్డ్ పోటీలు, వారి అనుభవం, తదితర అంశాలపై తక్కువ నిడివితో వీడియో చేయాలి. గురువారం ఈ వీడియోను మిస్ వరల్డ్ యాప్ లో అప్ లోడ్ చేశారు. ఇందులో ఎవరి వీడియోకు ఎక్కువ వ్యూస్, లైక్ వచ్చిన వాటిని పరిగణలోకి తీసుకోవడంతోపాటు వారి కంటెంటును బట్టి వారిని ఒకరిని విజేతగా ప్రకటిస్తారని సమాచారం.
Also Read: Plots Fraud: ప్లాట్ కొనుగోలు పేరుతో మోసం.. 28.20 లక్షల నగదు దోచిన ముగ్గురు అరెస్ట్!
కొంతమందికే సమాచారం
అధికారులు కొన్ని మీడియాకే సమాచారం ఇస్తున్నారు. పోటీలకు సంబంధించి కొంతమంది మీడియా ప్రతినిధులకు మాత్రమే సమాచారం ఇవ్వకపోవడంపై ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. అధికారుల మధ్య సమన్వయం లోపంతో ఇలా జరిగిందని తేలడంతో ప్రభుత్వం సంబంధిత అధికారులపై సీరియస్ అయినట్లు తెలిసింది. ఫైనల్ పోటీల్లో ఇలాంటి పొరపాట్లకు తావులేకుండా కోర్డినేషన్ చేసుకోవాలని ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. పోటీల కవరేజ్ సరిగా రావడం లేదని ప్రభుత్వం ఆరా తీయడంతో అధికారులు, నిర్వాహకుల మధ్య సమన్వయం లోపం ఉన్నట్లు స్పష్టమైంది.
Also Read: MLA Revuri Prakash Reddy: మహిళల కోసం ప్రత్యేక పాల డెయిరీ.. ఆర్థిక అభివృద్ధికి నూతన అడుగు!