Hyderabad Blast Plot(image credit:X)
హైదరాబాద్

Hyderabad Blast Plot: పేలుళ్ల కుట్ర కేసులో వెలుగులోకి సంచలన నిజాలు..

Hyderabad Blast Plot: హైదరాబాద్‌ పేలుళ్లకు కుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ పై దృష్టి పెట్టిన పోలీసులు.. హైదరాబాద్‌లో ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేసారు. సిరాజ్‌, సమీర్‌ రిమాండ్‌ రిపోర్ట్‌లో కీలక అంశాలను పోలీసులు ప్రస్తావించారు. ఇన్‌స్టాగ్రాంలో  ఆరుగురు వ్యక్తులు గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు.

అందులో సిరాజ్‌, సమీర్‌తోపాటు టీమ్‌లో కర్నాటక, మహారాష్ట్రకు చెందిన యువకులు ఉన్నట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. హైదరాబాద్‌లో 3 రోజులపాటు కలిసి ఉన్న ఆరుగురు గ్యాంగ్‌, ఐసిస్‌ హ్యాండ్లర్‌ సౌదీ నుంచి ఇచ్చే ఆదేశాలు అమలు చేయడంపై మీటింగ్‌ ఏర్పాటు చేసుకున్నారు.

Also read: Mahesh Babu Family Covid-19: షాకింగ్ న్యూస్.. మహేష్ బాబు ఫ్యామిలీలో కరోనా పాజిటివ్.. పోస్ట్ వైరల్

అనంతరం టిఫిన్‌ బాక్స్‌ బాంబులు తయారు చేయాలని ఇద్దరికి ఆదేశాలు రావడంతో పాటు .. మిగతా నలుగురికి బాంబ్‌లు పెట్టే టార్గెట్లు గుర్తించాలని ఐసిస్‌ హ్యాండ్లర్‌ ఆదేశాలు జారీ చేసారు. అమేజాన్‌లో టిఫిన్‌బాక్స్‌లు, వైర్లు, రిమోట్‌ సెల్స్‌ సిరాజ్ ఆర్డర్ చేయడంతో నిన్న విజయనగరంలో సిరాజ్, హైదరాబాద్‌లో సమీర్‌ అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా ఇద్దరికీ విజయనగరం కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది.

అరెస్టు సమయంలో సిరాజ్ దగ్గర భారీగా పేలుడు పదార్థాలను గుర్తించిన పోలీసులు, అమ్మోనియం నైట్రేట్, సల్ఫర్‌, అల్యూమినియం పౌడర్ సీజ్ చేసారు. వీరికి ఎవరు సహకరిస్తున్నారు అనే కోణంలో పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు.

పహల్గాం, ఆపరేషన్ తర్వాత దేశంలో ఎక్కడేం జరుగుతుందో అని ప్రజలు భయపడుతున్నారు. ముఖ్యంగా విశ్వనగరంగా పేరున్న హైదరాబాద్‌లో ఉగ్రవాదుల పేరు వింటేనే జనం హడలిపోతున్నారు. నగరంలో గతంలో ఉగ్రవాదులు జంట పేలుళ్లు జరిపిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ ఏ క్షణం ఏం జరుగుతుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్‌లోనే కాకుండా దేశంలో ఉగ్రమూకలు లేకుండా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం పటిష్టంగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

Also read: Hydraa demolition: పుప్పాల గూడలో అక్రమ కట్టడాలు కూల్చివేత..!

 

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?