Gold Trading Scam: గోల్డ్ ట్రేడింగ్ పేర సైబర్ క్రిమినల్స్ ఓ వ్యక్తిని ఉచ్ఛులోకి లాగి 24.24 లక్షలు కొట్టేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. సికింద్రాబాద్ కు చెందిన ఓ వ్యక్తికి 2024, డిసెంబర్ 13న గుర్తు తెలియని నెంబర్ నుంచి వాట్సాప్ మెసెజ్ వచ్చింది. ఎవరా? అని బాధితుడు ఆ నెంబర్ కు ఫోన్ చేయగా అవతలి వైపు నుంచి మాట్లాడిన మహిళ తన పేరు శరణ్య అని పరిచయం చేసుకుంది. ఆ తరువాత పలుమార్లు బాధితునితో వాట్సాప్ ద్వారా మాట్లాడుతూ వచ్చి అతనికి స్నేహితురాలిగా మారింది. అనంతరం కేడీఈవన్ గోల్డ్ యాప్ ను ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకుని పెట్టుబడులు పెట్టాలని సూచించింది.
Also Read: Gold Rates: నేడు అతి భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్?
మొత్తం 24.24 లక్షలు పెట్టుబడులు
70శాతం లాభాలు వస్తాయని నమ్మించింది. ఆ తరువాత ఓ లాగిన్ ను పంపించింది. దీంట్లోకి లాగిన్ అయిన బాధితుడు మొదట్లో చిన్న చిన్న మొత్తాలు పెట్టుబడులుగా పెట్టగా వాటికి లాభాలు వచ్చినట్టుగా నమ్మించింది. డబ్బును విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని కూడా ఇచ్చింది. దాంతో బాధితుడు పలు దఫాలుగా మొత్తం 24.24 లక్షలు పెట్టుబడులుగా పెట్టాడు. వీటిపై 39 లక్షలు లాభం వచ్చినట్టుగా ఆన్ లైన్ అకౌంట్ లో కనిపించగా విత్ డ్రా చేసుకోవటానికి ప్రయత్నించాడు. అయితే, నగదు విత్ డ్రా కాలేదు. దాంతో శరణ్యకు ఫోన్ చేయగా టాక్స్, ఇతర ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని డబ్బు డిమాండ్ చేసింది. దాంతో మోసపోయినట్టు గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Also Read: Gold Price Today: బిగ్ షాక్.. మళ్ళీ పెరిగిన గోల్డ్ రేట్స్

